రెండు జన్మల కథతో పూరి 'మెహబూబా'

Puri Jagannadh mehbooba movie details

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన తనయుడు ఆకాష్ పూరి హీరోగా మెహబూబా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 1971లో భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. భారత్ పాక్ యుద్ధం కాలంలో చనిపోయిన ప్రేమ జంట తిరిగి ఈ కాలంలో పుట్టడం అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆకాష్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ చౌతా సంగీతమందిస్తున్నారు. పూరి తన సొంత బ్యానర్ లో మెహబూబా సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top