అవన్నీ చెత్త వార్తలు: హృతిక్ రోషన్ | ‘Pure nonsense’: Hrithik rubbishes reports of tiff with Salman | Sakshi
Sakshi News home page

అవన్నీ చెత్త వార్తలు: హృతిక్ రోషన్

Jul 11 2016 8:57 AM | Updated on Sep 4 2017 4:37 AM

అవన్నీ చెత్త వార్తలు: హృతిక్ రోషన్

అవన్నీ చెత్త వార్తలు: హృతిక్ రోషన్

సల్మాన్ ఖాన్ తో తనకు విభేదాలున్నాయని వచ్చిన వార్తలను హృతిక్ రోషన్ తోసిపుచ్చాడు.

ముంబై: సల్మాన్ ఖాన్ తో తనకు విభేదాలున్నాయని వచ్చిన వార్తలను హృతిక్ రోషన్ తోసిపుచ్చాడు. తమకు తగాదాలున్నట్టు రాసిన వార్తల్లో వాస్తవం లేదన్నాడు. మాడ్రిడ్ లో జరిగిన ఇంటర్నేషనల్ అవార్డుల ప్రదానోత్సంలో సల్మాన్, హృతిక మధ్య విభేదాలు తలెత్తినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో తన పక్కన డాన్స్ చేసేందుకు మహిళా డాన్సర్ అవసరమైంది. తన స్నేహితురాలు, నటి డైసీ షాను పేరును సల్మాన్ సూచించగా, హృతిక్ తిరస్కరించాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఇందులో ఏమాత్రం నిజం లేదని హృతిక్ తెలిపాడు.

‘మా గురించి రాసిందంతా అబద్దం. ఇవన్నీ చెత్తరాతలు. సల్మాన్, నేను నిరంతరం మాట్లాడుకుంటూ ఉంటామ’ని హృతిక్ చెప్పాడు. తన కోసం సల్మాన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ’సుల్తాన్’  సినిమా షో చూడాలనుకుంటున్నట్టు వెల్లడించాడు. విదేశాల్లో ఉండడం వల్ల ‘సుల్తాన్’  సినిమా చూడలేకపోయానని తెలిపాడు. దీంతో తన కోసం సల్మాన్ ఖాన్ ప్రత్యేక షో ఏర్పాటు చేశాడని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement