బాక్సాఫీస్ పులి | Pulimurugan Telugu version Manyam Puli releas today | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్ పులి

Dec 1 2016 11:38 PM | Updated on Sep 4 2017 9:38 PM

బాక్సాఫీస్ పులి

బాక్సాఫీస్ పులి

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కమలినీ ముఖర్జీ జంటగా జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘పులి మురుగన్’.

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కమలినీ ముఖర్జీ జంటగా జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘పులి మురుగన్’. వైశాఖ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో 100 కోట్ల పైగా వసూళ్లు సాధించింది. ఆ ఘనత సాధించిన తొలి మలయాళ చిత్రంగా రికార్డుల్లోకెక్కింది. శ్రీసరస్వతి ఫిల్మ్స్ అధినేత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి ‘మన్యం పులి’ పేరుతో నేడు తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఆయన మాట్లాడుతూ- ‘‘కేరళ, వియత్నాం పరిసరాల్లో రెండేళ్లు షూటింగ్ జరుపుకున్న చిత్రమిది. పీటర్ హెయిన్స్ ఫైట్స్ హైలెట్. మోహన్‌లాల్, పులి కాంబినేషన్‌లో తీసిన ఫైట్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. పిల్లలతో పాటు పెద్దలకూ నచ్చే అంశాలున్నాయి. మలయాళంలోలానే తెలుగు వారు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్.
 

Advertisement
 
Advertisement
Advertisement