ఆ సినిమా సీన్లు లీకయ్యాయని ఫిర్యాదు | Puli Makers Lodge Complaint Over Leaked Stills | Sakshi
Sakshi News home page

ఆ సినిమా సీన్లు లీకయ్యాయని ఫిర్యాదు

Jul 12 2015 3:25 PM | Updated on Sep 3 2017 5:23 AM

ఆ సినిమా సీన్లు లీకయ్యాయని ఫిర్యాదు

ఆ సినిమా సీన్లు లీకయ్యాయని ఫిర్యాదు

తమిళనాడులో ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న చిత్రం 'పులి' సన్నివేశాలు లీకయ్యాయంటూ ఆ చిత్ర యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చెన్నై: తమిళనాడులో ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న చిత్రం 'పులి' సన్నివేశాలు లీకయ్యాయంటూ ఆ చిత్ర యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాము వాటిని తొలగించినా ఇంకా ఆన్లైన్లో కనిపిస్తున్నాయని ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ క్రైం బ్రాంచ్ పోలీసులకు తెలిపారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, విజయ్ పుట్టిన రోజు సందర్భంగా దానికి సంబంధించిన తొలి టీజర్ను విడుదల చేశారు.

అయితే, ఈ టీజర్ విడుదలకు రెండు మూడు రోజుల ముందే ఆన్లైన్లో విడుదలై హల్ చల్ చేసింది. దీంతో తాము ఎంతో కష్టపడి ప్లాన్ చేసుకొని విడుదల చేయాలనుకున్న సీన్లు ఇలా తమకంటే ముందే ఎవరు ఎలా విడుదల చేశారో అర్థం కాలేదని చెప్పారు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఇలాంటి ప్రతిష్ఠాత్మక చిత్రాలను ముందే లీక్ చేస్తే చిత్ర నిర్మాతలే కాకుండా ఇండస్ట్రీ కూడా కుదేలవుతుందని చిత్ర దర్శకుడు చింబుదేవెన్ అన్నారు. ఈ చిత్రం సెప్టెంబర్లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement