రిలీజ్ రోజే కేబుల్ టీవీలో..! | Puducherry cable TV airs 'censor copy' of Udta Punjab | Sakshi
Sakshi News home page

రిలీజ్ రోజే కేబుల్ టీవీలో..!

Jun 18 2016 9:20 AM | Updated on Sep 4 2017 2:49 AM

రిలీజ్ రోజే కేబుల్ టీవీలో..!

రిలీజ్ రోజే కేబుల్ టీవీలో..!

బాలీవుడ్ కాంట్రవర్షియల్ సినిమా ఉడ్తా పంజాబ్కు కష్టాలు తీరేలా లేవు. ముందు సెన్సార్ సమస్య తరువాత కోర్టు వివాదం.. ఇలా ఒక్కో సమస్య నుంచి బయటపడిన ఈ సినిమాకు ఇప్పుడు పైరసీతో భారీ....

బాలీవుడ్ కాంట్రవర్సీయల్ మూవీ ఉడ్తా పంజాబ్కు కష్టాలు తీరేలా లేవు. ముందు సెన్సార్ సమస్య తరువాత కోర్టు వివాదం.. ఇలా ఒక్కో సమస్య నుంచి బయటపడిన ఈ సినిమాకు ఇప్పుడు పైరసీతో భారీ దెబ్బ తగిలింది. సినిమా రిలీజ్కు ముందే ఆన్లైన్లో పూర్తి సినిమా పెట్టేయడంతో నిర్మాతలు తల పట్టుకున్నారు. పైరసీపై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చినా, ఆన్లైన్లో సినిమా సర్క్యులేట్ అవ్వటాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు.

తాజాగా పుదుచ్చెరిలో జరిగిన సంఘటన సినీ వర్గాలకు షాక్ ఇచ్చింది. పుదుచ్చెరిలో లోకల్గా నడుస్తున్న కేబుల్ ఛానల్ శక్తి టివిలో ఉడ్తా పంజాబ్ పైరసీ వర్షన్ను ప్రసారం చేశారు. పూర్తి సినిమా టెలికాస్ట్ అవ్వటంతో ఆ ప్రాంతంలో సినిమా కలెక్షన్లకు భారీ దెబ్బపడింది. ఈ విషయాన్ని ఫోటోతో సహా తమిళ హీరో సూర్య తన ట్విట్టర్లో పోస్ట్ చేయటంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

సినిమా పైరసీ అయిన దగ్గరనుంచి చిత్ర నిర్మాతలతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఎంతగా ప్రచారం చేస్తున్నా, పైరసీని మాత్రం అరికట్టలేకపోతున్నారు. ఇప్పటికైన పైరసీ చేసిన వారిని శిక్షించడానికి కఠిన చట్టాలను ఏర్పాటు చేయాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement