ప్రియాంక ప్రొడక్షన్లో అనుష్క | priyanka producing a movie with anushka Sharma | Sakshi
Sakshi News home page

ప్రియాంక ప్రొడక్షన్లో అనుష్క

Jan 26 2016 12:35 PM | Updated on Sep 3 2017 4:21 PM

ప్రియాంక ప్రొడక్షన్లో అనుష్క

ప్రియాంక ప్రొడక్షన్లో అనుష్క

బాలీవుడ్లో సరికొత్త సాంప్రదాయానికి తెరతీస్తున్నారు హీరోయిన్లు ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ. నార్త్ ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ ఈగోలను పక్కన పెట్టి కలిసి పనిచేసిన సందర్భాలు చాలా తక్కువ...

బాలీవుడ్లో సరికొత్త సాంప్రదాయానికి తెరతీస్తున్నారు హీరోయిన్లు ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ. నార్త్ ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ ఈగోలను పక్కన పెట్టి కలిసి పనిచేసిన సందర్భాలు చాలా తక్కువ. ముఖ్యంగా తమ సొంత నిర్మాణ సంస్థల్లో ఇతర హీరోయిన్లను ఎంపిక చేయడానికి బాలీవుడ్ భామలు అస్సలు అంగీకరించరు. ఆ సాంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.

నటిగా బాలీవుడ్తో పాటు హాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది. పర్పల్ ఫెబల్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఈ బ్యూటీ ఒకేసారి మూడు సినిమాలను నిర్మిస్తోంది. ఇందులో భాగం తెరకెక్కనున్న ఓ సినిమాకు అనుష్క శర్మను హీరోయిన్గా ఎంపిక చేసుకుంది ప్రియాంక.

ముందుగా ఈ పాత్రలో తానే నటించాలని భావించినా.., తాను ప్రస్తుతం ప్రకాష్ జా దర్శకత్వంలో నటిస్తున్న జై గంగాజల్ సినిమాతో క్లాష్ రావటంతో ఆ పాత్రకు అనుష్క శర్మను ఎంపిక చేసింది. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా ప్రియాంక నిర్మాణంలో అనుష్క సినిమా ఉంటుందన్న టాక్ ఇప్పుడు బాలీవుడ్లో ప్రముఖంగా వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement