breaking news
Purple pebble Pictures
-
ప్రియాంక ప్రొడక్షన్లో అనుష్క
బాలీవుడ్లో సరికొత్త సాంప్రదాయానికి తెరతీస్తున్నారు హీరోయిన్లు ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ. నార్త్ ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ ఈగోలను పక్కన పెట్టి కలిసి పనిచేసిన సందర్భాలు చాలా తక్కువ. ముఖ్యంగా తమ సొంత నిర్మాణ సంస్థల్లో ఇతర హీరోయిన్లను ఎంపిక చేయడానికి బాలీవుడ్ భామలు అస్సలు అంగీకరించరు. ఆ సాంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. నటిగా బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది. పర్పల్ ఫెబల్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఈ బ్యూటీ ఒకేసారి మూడు సినిమాలను నిర్మిస్తోంది. ఇందులో భాగం తెరకెక్కనున్న ఓ సినిమాకు అనుష్క శర్మను హీరోయిన్గా ఎంపిక చేసుకుంది ప్రియాంక. ముందుగా ఈ పాత్రలో తానే నటించాలని భావించినా.., తాను ప్రస్తుతం ప్రకాష్ జా దర్శకత్వంలో నటిస్తున్న జై గంగాజల్ సినిమాతో క్లాష్ రావటంతో ఆ పాత్రకు అనుష్క శర్మను ఎంపిక చేసింది. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా ప్రియాంక నిర్మాణంలో అనుష్క సినిమా ఉంటుందన్న టాక్ ఇప్పుడు బాలీవుడ్లో ప్రముఖంగా వినిపిస్తోంది. -
భయమేం లేదు నాకు!
కథానాయికలు నిర్మాణ రంగంలోకి ప్రవేశించడం కొత్త కాదు. పూజా భట్, జూహీ చావ్లా, అనుష్కా శర్మ, దియా మిర్జా, అమీషా పటేల్.. ఇలా హిందీ రంగంలో పలువురు తారలు నిర్మాతలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. హాట్ గాళ్ ప్రియాంకా చోప్రా కూడా ఎప్పట్నుంచో నిర్మాతగా మారాలనుకుంటున్నారు. ‘మేడమ్‌జీ’ పేరుతో ఓ సినిమా ప్రకటించారు కూడా. ఇది జరిగి ఏడాది పైనే అయ్యింది. కానీ, ‘మేడమ్‌జీ’ని ప్రకటన వరకే పరిమితం చేసేశారు. కథానాయికగా కోట్లు తీసుకుంటున్నప్పటికీ నిర్మాతగా పెట్టుబడి పెట్టడానికి ప్రియాంక భయపడుతున్నారనీ, అందుకే వెనకడుగు వేసేశారన్నది కొంతమంది ఊహ. కానీ, భయమా? నాకా? అంటున్నారీ బ్యూటీ. ‘‘హిందీ చిత్రం ‘బాజీరావ్ మస్తానీ’, అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’తో బిజీగా ఉండడంవల్ల ‘మేడమ్‌జీ’ని మొదలుపెట్టేకపోయాను. ఎప్పుడు మొదలుపెడతానో చెప్పలేను కానీ, కచ్చితంగా ఈ సినిమా నిర్మిస్తాను’’ అని ప్రియాంక పేర్కొన్నారు. కొత్తవారికి ఆహ్వానం. ‘పర్పుల్ పెబల్స్ పిక్చర్స్’ పతాకంపై ఆమె సినిమాలు తీయాలనుకుంటున్నారు. కొన్ని చిత్రాల్లో తాను నటించాలనుకుంటున్నారు. స్టార్స్‌తో కొన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నారు. కొత్తవారితో కూడా సినిమాలు తీయాలనుకుంటున్నానని ప్రియాంక తెలిపారు. కొంతమంది రచయితలతో కలిసి కొన్ని స్క్రిప్ట్స్ కూడా వర్కవుట్ చేశారట. అనుకూలమైన సమయం చూసుకుని, వాటి గురించి ప్రకటిస్తానని ఆమె అన్నారు. నిర్మాణ రంగంలోకి మాత్రమేనా? దర్శకురాలిగా కూడా మారాలనుకుంటున్నారా? అనే ప్రశ్న ప్రియాంక ముందుంచితే - ‘‘నా సినిమాల షూటింగ్ స్పాట్స్‌లో డెరైక్టర్స్ జాబ్‌ని గమనిస్తుంటాను. ఎలా చేస్తున్నారా? అని ఆశ్చర్యం కలుగుతుంది. డెరైక్షన్ అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను ఉన్న బిజీలో దాని గురించి ఆలోచించలేను. కంటి నిండా నిద్రపోవడానికి కూడా టైమ్ దొరకడంలేదు. బాగా తీరిక చిక్కినప్పుడు డెరైక్షన్ గురించి ఆలోచిస్తాను. నాకు తెలిసి ఇప్పుడప్పుడే మాత్రం కాదు’’ అని చెప్పారు.