ప్రియాంక కిడ్నాప్‌?

Priyanka Chopra to star in Netflix superhero film We Can Be Heroes - Sakshi

గ్రహాంతరవాసులు బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రాను కిడ్నాప్‌ చేశారు. మరి.. వారి డిమాండ్స్‌ ఏంటి? ప్రియాంకా ఎలా బయటపడ్డారు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొంత సమయం ఆగక తప్పదు. అయితే ఇదంతా ప్రియాంక రీల్‌ లైఫ్‌ గురించే. ‘అలిటా: బాటిల్‌ ఏంజిల్‌’ ఫేమ్‌ రాబర్ట్‌ రోడ్రిగెజ్‌ ‘వుయ్‌ కెన్‌ బీ హీరోస్‌’ అనే నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌ ఫిల్మ్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మిస్‌ గ్రాడెన్కో అనే కీలక పాత్రను ప్రియాంకా చోప్రా పోషిస్తున్నారు.

భూమిపై ఉన్న సూపర్‌ హీరోస్‌ అందరినీ గ్రహాంతరవాసులు కిడ్నాప్‌ చేసినప్పుడు, ఆ సూపర్‌ హీరోస్‌ పిల్లలు తమ తల్లిదండ్రులను ఎలా విడిపించారన్నదే ‘వుయ్‌ కెన్‌ బీ హీరోస్‌’ కథాంశమట. కథ ప్రకారం ప్రియాంకది తల్లి పాత్ర అని అర్థమవుతోంది. క్రిస్టియన్‌ స్లేటర్, యా యా గోస్సెలిన్, అకిరా అక్బర్, ఆండ్రూ డియాజ్‌లతో పాటు కొందరు ప్రముఖ చైల్డ్‌ ఆర్టిస్టులు ఈ వెబ్‌ ఫిల్మ్‌లో కీలక పాత్రధారులు. ఈ వెబ్‌ ఫిల్మ్‌ను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక ప్రియాంకా బాలీవుడ్‌ కబుర్లు చెప్పుకుంటే ఆమె నటించిన ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top