నిక్‌కి యావజ్జీవ శిక్ష విధించింది

Priyanka Chopra responds to The Cut article like a boss lady - Sakshi

ప్రియాంకా చోప్రా గురించి హాలీవుడ్‌ పత్రిక కథనం

బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా, అమెరికన్‌ గాయకుడు నిక్‌ జోనస్‌ ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారి వివాహ బంధంపై న్యూయార్క్‌కు చెందిన ‘ది కట్‌’ అనే మ్యాగజీన్‌లో వచ్చిన ఓ కథనంపై ప్రియాంకా చోప్రా మండిపడ్డారు. ‘‘ఇలాంటి పిచ్చి కథనాలను నేను పట్టించుకోను. అసలు దీని గురించి కామెంట్‌ చేయాలని కూడా అనుకోవడంలేదు. ఇలాంటివి నా పరిధిలోకి రావు కూడా. ప్రస్తుతం నేను సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను.

ఇలాంటి వార్తలు నన్ను ఏ విధంగానూ డిస్టర్బ్‌ చేయలేవు’’ అన్నారు ప్రియాంక. ఇంతకీ ‘ది కట్‌’ మ్యాగజీన్‌ కథ ఏంటంటే.. ప్రియాంక గురించి ఆ పత్రిక విలేకరి మరియా స్మిత్‌ ఓ కథనం రాశారు. ‘అసలు ప్రియాంక, నిక్‌ జోనస్‌ల ప్రేమ నిజమేనా? పాపం నిక్‌.. అందరి కుర్రాళ్లలాగే కాలక్షేపానికి కొద్దిరోజులు ప్రియాంకతో ప్రేమాయణం సాగించి వదిలేద్దామనుకున్నాడు. కానీ, గ్లోబల్‌ స్కామ్‌ ఆర్టిస్ట్‌ అయిన ప్రియాంక ఏకంగా అతన్ని వివాహం చేసుకునేలా చేసింది.

పెండ్లి పేరుతో నిక్‌ను శాశ్వతంగా కట్టేసుకుని, ఆయనకు యావజ్జీవ శిక్ష విధించింది’’ అని ఘాటుగా రాశారు. ఇవి జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు అంటూ ఆ పత్రికపై తీవ్రమైన విమర్శలు రావడంతో చివరకు ఆ పత్రిక క్షమాపణలు చెప్పింది. సోనమ్‌ కపూర్, నిక్‌ సోదరుడు జో జోనస్, హాలీవుడ్‌ నటి సోఫీ టర్నర్‌ వంటి పలువురు ప్రియాంక గురించి సదరు పత్రిక అలా రాయడం సరి కాదని సోషల్‌ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top