దీపిక స్థానంలో ప్రియాంక!

Priyanka Chopra reclaims throne of Sexiest Asian Woman from Deepika Padukone - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా మరోసారి ‘ఆసియా సెక్సీయస్ట్‌ విమెన్‌గా’ నిలిచారు. ఇప్పటివరకూ నాలుగుసార్లు ఆసియా సెక్సీయస్ట్‌ విమెన్‌గా నిలిచిన ఆమె ఐదోసారీ ఈ టైటిల్‌ గెలుచుకుని శెభాష్‌ అనిపించుకున్నారు. లండన్‌కి చెందిన ఓ వారపత్రిక నిర్వహించిన పోలింగ్‌లో ఆమె మొదటి స్థానం సంపాదించుకున్నారు. అమెరికా టీవీ సిరీస్‌ ‘క్వాంటికో’లో ఈ బ్యూటీ ఎంత గ్లామర్‌ ఒలకబోసిందో తెలిసిందే. ‘క్వాంటికో’తో అక్కడ కూడా అభిమానులను సంపాదించుకున్నారు ప్రియాంక. 50 మందితో నిర్వహించిన పోలింగ్‌లో ఆమె తొలి స్థానంలో నిలవగా, టీవీ నటిగా పాపులర్‌ అయిన నియాశర్మ ద్వితీయ స్థానంలో నిలిచారు.

గత ఏడాది తొలి స్థానంలో నిలిచిన బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పడుకోన్‌ని ప్రియాంక ఈసారి బీట్‌ చేశారు. అంతకుముందు సంవత్సరం  కైవసం చేసుకున్న ‘నంబర్‌ వన్‌’ స్థానాన్ని మళ్లీ దక్కించుకున్నారు. ఈ ఏడాది దీపికా మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కుర్రా తార ఆలియా భట్‌ నాలుగో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో పాక్‌ నటి మహీరాఖాన్‌కి కూడా చోటు దక్కింది. ‘‘ఆసియా సెక్సీయస్ట్‌ విమెన్‌గా’ ఐదోసారి నిలవడం చాలా ఆనందంగా ఉంది. నేనింత అందంగా ఉన్నానంటే దానికి కారణం నా పేరంట్స్‌ జీన్సే. అలాగే ఐదోసారి ఈ టైటిల్‌ నాకు దక్కేలా చేసిన అభిమానులు మరో కారణం. నన్ను గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు ప్రియాంకా చోప్రా.

Back to Top