బాలీవుడ్ భామను హాలీవుడ్ స్టార్ తెగ పొగిడేశాడు! | Priyanka Chopra plays bad roles better, says Dwayne Johnson | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ భామను హాలీవుడ్ స్టార్ తెగ పొగిడేశాడు!

Feb 17 2016 5:13 PM | Updated on Aug 14 2018 3:48 PM

బాలీవుడ్ భామను హాలీవుడ్ స్టార్ తెగ పొగిడేశాడు! - Sakshi

బాలీవుడ్ భామను హాలీవుడ్ స్టార్ తెగ పొగిడేశాడు!

నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా చాలా బాగా నటించగలదని హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ (రాక్ గా అందరికీ తెలుసు) పేర్కొన్నాడు.

లాస్ ఏంజెలిస్:  నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా చాలా బాగా నటించగలదని హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ (రాక్ గా అందరికీ తెలుసు) పేర్కొన్నాడు. బాలీవుడ్ సుందరి ఇటీవలే హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలోని టీవీ ప్రోగ్రామ్ 'క్వాంటికో' సీరీస్తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ వెంటనే ఈ బాలీవుడ్ హీరోయిన్ మరో హాలీవుడ్ ప్రాజెక్ట్కు సిద్ధం అవుతోంది. 1990లలో సూపర్ హిట్ అయిన టీవీ సిరీస్ 'బేవాచ్' ఆధారంగా అదే పేరుతో తెరకెక్కిస్తోన్న సినిమాలో విలన్ రోల్లో కనిపించనుంది. ఈ విషయంపై ఆ మూవీలో లీడ్ రోల్లో నటిస్తున్న డ్వేన్ జాన్సన్ అభిమానులతో మరిన్ని ముచ్చట్లు షేర్ చేసుకున్నాడు.

మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక బాలీవుడ్లో నెగెటివ్ రోల్ తోనే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అన్నీ లీడ్ రోల్స్ మాత్రమే చేస్తూ వచ్చింది. చాలా ఏళ్ల తరువాత మరోసారి హాలీవుడ్లో నెగెటివ్ రోల్ లో కనిపించనుంది. ఆమె విలన్ రోల్ లో నటిస్తుండటంపై డ్వేన్ జాన్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోని బిగ్గెస్ట్ స్టార్స్ లో ప్రియాంక ఒకరని పేర్కొన్నాడు. ఆమె చాలా తెలివైన నటి, ఈ మూవీకి ప్రియాంక ఫర్ఫెక్ట్ గా సరిపోతుందని పొగిడేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా వచ్చే వారం నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. డేవిడ్ హాస్సెల్ హోఫ్, పమేలా అండర్సన్ తదితర స్టార్స్ ఇందులో కనిపించనున్నారు. కాలిఫోర్నియా లోని లాస్ ఏంజెలిస్ బీచ్ లల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్, పోలీసులను కథాంశంగా తీసుకుని 'బేవాచ్' చిత్రీకరించనున్నట్లు డ్వేన్ జాన్సన్ వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement