 
															యువతను ఆకట్టుకున్నవారికే ఈ అవార్డు..
ప్రఖ్యాత టీమ్ చాయిస్ అవార్డుకు ఈ ఏడాదికిగాను నటి ప్రియాంక చోప్రా నామినేట్ అయ్యారు.
	ముంబై: యువతే న్యాయమూర్తులుగా వ్యవహరించి, ఎంపిక చేసే ప్రఖ్యాత టీమ్ చాయిస్ అవార్డుకు ఈ ఏడాదికిగాను నటి ప్రియాంక చోప్రా నామినేట్ అయ్యారు. సంగీతం, సినిమా, క్రీడలు, టెలివిజన్, ప్యాషన్ రంగాలలో విశేష ప్రతిభ కనబర్చి, యువతను ఆకట్టుకున్నవారికే ఈ అవార్డు దక్కుతుంది. ఎందుకంటే.. 13 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగినవారు  మాత్రమే ఓటింగ్‌లో పాల్గొని, విజేతలను ఎంపిక చేస్తారు.
	
	క్వాంటికో టీవీ సీరిస్ ద్వారా హాలీవుడ్‌కు పరిచయమైన ప్రియాంక.. అక్కడి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ తర్వాత రెండో అడుగుగా ‘బేవాచ్’ బాలీవుడ్ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో లేడీ విలన్ గా విశేష ప్రతిభ కనబర్చిన ప్రియాంకను విలన్ కేటగిరీలోనే నామినేట్ చేశారు. ఈ విషయమై ప్రియాంక స్పందిస్తూ... టీమ్ చాయిస్ అవార్డుకు నామినేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.  
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
