ఆసియాలోనే శృంగార మహిళగా నటి ప్రియాంక..

Priyanka Chopra named world’s sexiest Asian woman in 2017 - Sakshi

ఆసియాలోనే అత్యంత శృంగార మహిళగా బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా గుర్తింపు పొందారు. లండన్‌లోని ఈస్ట్రన్‌ ఐ నిర్వహించిన ఆన్‌లైన్‌ పోల్‌లో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. ఈస్ట్రన్‌ ఐ అనే వారపత్రిక ఏసియన్‌ వుమెన్‌ పేరుతో ఆన్‌లైన్‌ పోల్‌ను నిర్వహిస్తోంది. అంతేకాక ఈ పోల్‌లో ఐదుసార్లు మొదటిస్థానంలో నిలిచి ప్రియాంక చోప్రా రికార్డు సృష్టించారు. ప్రియాంకకి సోషల్‌ మీడియాలో అత్యంత ఫాలోయింగ్‌ ఉంది. ఆమె ఇస్టాగ్రామ్‌లో 20 మిలియన్ల పైన ఫాలోయర్స్‌ ఉన్నారు.

ఈ వారపత్రిక 2016లో నిర్వహించిన పోల్‌లో దీపికా పడుకొణె అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆమె ఈ సంవత్సరం మూడోస్థానంలో నిలిచారు. దీనిపై ప్రియాంక తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా స్పందించారు. ‘  ఇది నా ఘనత కాదు. ఆన్‌లైన్‌లో నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి.. నా జెనిటిక్స్‌ వారసత్వానికే ఈ గౌరవం దక్కుతుందని’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ఇండియా బుల్లితెర నటి నియా శర్మ  రెండో స్థానంలో నిలిచారు.

టాప్‌-10 లో నిలిచిన బామలు: 1. ప్రియాంక చోప్పా(ఇండియా) 2. నియా శర్మ 3. దీపికా పడుకొణె 4. ఆలియా భట్‌ 5. మాహిర్‌ ఖాన్‌(పాకిస్తాన్‌) 6.ద్రష్టి దమనీ 7. కత్రినాకైఫ్‌ 8.శ్రద్ధాకపూర్‌ 9. గౌహర్‌ ఖాన్‌ 10. రుబినా డిలాక్‌లు నిలిచారు. అత్యంత వయసు ఉన్న అతిలోక సుందరి శ్రీదేవి(54) ఈ జాబితాలో 45వ స్థానంలో నిలవ్వడం గమనార్హం.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top