‘తన ఉత్తమమైన దుస్తుల్లో ఇది ఒకటి’

Priyanka Chopra Mother Madhu Chopra Said She Likes Priyanka Grammy Dress - Sakshi

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా గ్రామీ ఫ్రాక్‌పై తాజగా ఆమె తల్లి మధు చోప్రా స్పందించారు. ప్రియాంక ఓ ఆవార్డుల ఫంక‌్షన్‌లో ధరించిన గ్రామీడ్రెస్‌ తనకు బాగా నచ్చిందన్నారు. అంతేగాక ప్రియాంక డ్రెస్‌పై వచ్చిన విమర్శలు ఇంకా తనని బలవంతురాలిని చేశాయంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నాకు ప్రియాంక డ్రెస్‌ నచ్చింది. ముందే ఆ ఫ్రాక్‌ నమూనాను నాకు చూపించింది. అయితే అప్పుడు దానిని క్యారీ చేయడం కాస్తా కష్టమెమో అనుకున్నాను. కానీ ప్రియాంక దాన్ని అనుకున్నదాని కంటే బాగా హ్యండిల్‌ చేయగలిగింది. తాను ధరించే ఉత్తమమైనా దుస్తుల్లో ఇది ఒకటి’ అంటూ మధు చెప్పుకొచ్చారు. 

కాగా అమెరికా లాస్‌ఏంజెల్స్‌లో గ్రామీ అవార్డుల కార్యక్రమాన్ని ఇటీవలె ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్‌లో ప్రియాంక అందాలను ఆరబోస్తూ దుస్తులను ధరించింది. అయితే భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రియాంక అలాంటి దుస్తులతో హాజరవడమేంటని ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రముఖ డిజైనర్‌ వెండల్‌ రాడ్రిక్స్‌ సైతం ఆమె డ్రెస్‌ను విమర్శించాడు. కొన్ని రకాల బట్టలు ఏ వయసులో వేసుకోవాలో ఆ వయసులోనే ధరించాలని ప్రియాంకకు సూచించాడు. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో అతను ఆ పోస్ట్‌ను తొలగించి.. తాను ప్రియాంక డ్రెస్సును మాత్రమే విమర్శించానని, ఆమెను కాదని వివరణ ఇచ్చాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top