కంటతడి పెట్టిన శిల్పాశెట్టి
శిల్పాశెట్టి భాదపడటానికి కారణం ప్రియాంక చోప్రా నటించిన 'మేరి కోమ్' చిత్రాన్ని చూసి ఉద్వేగానికి లోనుకావడమే.
ముంబై: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఏడవడానికి కారణం ప్రియాంక చోప్రా కారణమైందట. ప్రియాంక చోప్రా నటించిన 'మేరి కోమ్' చిత్రాన్ని చూసి ఉద్వేగానికి లోనవ్వడమే తన దుఖానికి కారణమని శిల్పాశెట్టి తెలిపింది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన 'మేరి కోమ్' చిత్రం సెప్టెంబర్ 5 తేదిన విడుదలైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రాన్ని చూసిన శిల్పా. ప్రియాంక నటనను చూసి ఉద్వేగానిక లోనై కంటతడి పెట్టినట్టు ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
మేరి కోమ్ చిత్రాన్ని చూశాను. ప్రియాంక అద్బుతంగా నటించింది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం బాగుంది. ఈ చిత్రాన్ని చూసి కంట తడి పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రం అని శిల్ప ట్వీట్ చేశారు. బాక్సింగ్ చాంఫియన్ మేరి కోమ్ తో శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు అభినందించారు.