వందలో ఒక్కరు! | Priyanka Chopra makes it to Instagram Rich List 2019 | Sakshi
Sakshi News home page

వందలో ఒక్కరు!

Jul 25 2019 5:59 AM | Updated on Jul 25 2019 5:59 AM

Priyanka Chopra makes it to Instagram Rich List 2019 - Sakshi

ప్రియాంకా చోప్రా

సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్‌ హీరోయిన్లలో ప్రియాంకా చోప్రా ఒకరు. ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు దాదాపు 4 కోట్ల 30 లక్షల ఫాలోయర్స్‌ ఉన్నారు. ట్విటర్‌లో దాదాపు 2 కోట్ల 50 లక్షల ఫాలోయర్స్‌ ఉన్నారు. ఇప్పుడీ సంగతి ఎందుకంటే.. సెలబ్రీటీలు తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన వాటికి  ఎంత చార్జ్‌ చేస్తారనే అంశం ఆధారంగా యూఎస్‌కు చెందిన ఓ కంపెనీ విడుదల చేసిన ‘ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌ లిస్ట్‌’లో ప్రియాంకా చోప్రా 19వ స్థానంలో నిలిచారు.

ఏదైనా ప్రొడక్ట్‌ను తన ఇన్‌స్టా ఖాతా ద్వారా ప్రమోట్‌ చేయడానికి ప్రియాంకా చోప్రా దాదాపు కోటీ 86 లక్షల 80 వేల రూపాయలు తీసుకుంటారట. ఆ కంపెనీ విడుదల చేసిన వందమంది జాబితాలో ఉన్న ప్రముఖుల్లో అమెరికన్‌ మోడల్‌  కైలీ జెన్నర్‌ తొలి స్థానంలో నిలిచారు. అలాగే ఈ జాబితాలో చోటు సంపాదించిన ఒకేఒక్క బాలీవుడ్‌ నటి కూడా ప్రియాంకే కావడం విశేషం. అలాగే ఇండియా తరఫున విరాట్‌ కోహ్లీ 23వ స్థానంలో నిలవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement