అనాథ చిన్నారులతో చిందేసిన ప్రియాంక | Priyanka Chopra Dancing With Kids At Orphanage | Sakshi
Sakshi News home page

అనాథ చిన్నారులతో చిందేసిన ప్రియాంక

Aug 20 2018 2:38 PM | Updated on Aug 20 2018 3:09 PM

Priyanka Chopra Dancing With Kids At Orphanage - Sakshi

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ల ఎంగేజ్‌మెంట్ శనివారం సంప్రదాయబద్ధంగా ముంబైలో జరిగిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి నిక్‌, పిగ్గీ చాప్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. కాగా ఈ ప్రేమజంట ఆదివారం సెయింట్‌ కాథరిన్స్‌ అనాథ ఆశ్రమాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా కాసేపు చిన్నారులతో కలిసి ముచ్చటించారు. అలాగే ఓ చిన్నారితో కలిసి ప్రియాంక తన సినిమా ‘గూండే’ లోని హిట్‌ సాంగ్‌కు చిందేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కాగా శనివారం సాయంత్రం ప్రియానిక్‌ జంట స్టార్‌ హోటల్లో ఏర్పాటు చేసిన పార్టీకి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అలియాభట్‌, ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ, ఇషా అంబానీ, సంజయ్‌ లీలా బన్సాలీ, విశాల్‌ భరద్వాజ్‌, పరిణీతి చోప్రా, సల్మాన్‌ ఖాన్‌ చెల్లెలు అర్పితా ఖాన్‌ శర్మ, ఆమె భర్త ఆయూష్‌ శర్మలు ఈ పార్టీలో సందడి చేశారు. ఇక నిక్‌ జోనాస్‌ తనకు కాబోయే భార్య ప్రియాంక చోప్రా, తల్లిదండ్రులు కెవిన్‌ జోనాస్‌, డెనిస్‌లతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement