బాలీవుడ్ సినిమా అంగీకరిస్తుందా..? | Priyanka Chopra Is Back In Mumbai | Sakshi
Sakshi News home page

Mar 20 2018 11:47 AM | Updated on Mar 20 2018 1:04 PM

Priyanka Chopra Is Back In Mumbai - Sakshi

ముంబై విమానాశ్రయంలో ప్రియాంక చోప్రా

చాలా రోజులుగా బాలీవుడ్‌ సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రియాంక చోప్రా త్వరలో ఓ హిందీ సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. వరుసగా హాలీవుడ్‌ సినిమాలతో టీవీ సీరిస్‌లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ బాజీరావ్‌ మస్తాని తరువాత ఒక్క హిందీ సినిమా కూడా చేయలేదు. దీంతో ప్రియాంక బాలీవుడ్‌ సినిమాలో చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇదే పని మీద ముంబై చేరుకున్న ప్రియాంక చోప్రా మూడు రోజుల పాటు ఇక్కడ దర్శక నిర్మాతలతో చర్చలు జరపనున్నారు. త్వరలోనే ఓ బాలీవుడ్ సినిమా సైన్‌ చేసి ఇక్కడి ప్రేక్షకులను అలరించాలన్న ప్లాన్‌లోనే ప్రియాంక ముంబై వచ్చారన్న టాక్‌ వినిపిస్తోంది. కొద్ది రోజులుగా కల్పనా చావ్లా బయోపిక్‌ లో ప్రియాంక నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ ను ఈ ట్రిప్‌ లోనే ఫైనల్ చేస్తారో లేదో చూడాలి. మూడు రోజుల పాటు ముంబైలో గడపనున్న పీసీ తరువాత క్వాంటికో 3 సీరిస్‌ కోసం ఐర్లాండ్‌ వెళ్లనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement