లెజెండరీ డైరెక్టర్తో వెంకీ నెక్ట్స్..! | Priyadarshan to direct victory venkatesh | Sakshi
Sakshi News home page

లెజెండరీ డైరెక్టర్తో వెంకీ నెక్ట్స్..!

May 17 2017 1:27 PM | Updated on Sep 5 2017 11:22 AM

లెజెండరీ డైరెక్టర్తో వెంకీ నెక్ట్స్..!

లెజెండరీ డైరెక్టర్తో వెంకీ నెక్ట్స్..!

గురు సినిమాతో ఆకట్టుకున్న విక్టరీ వెంకటేష్ ఇంత వరకు తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేయలేదు. గురు సినిమా సెట్స్

గురు సినిమాతో ఆకట్టుకున్న విక్టరీ వెంకటేష్ ఇంత వరకు తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేయలేదు. గురు సినిమా సెట్స్ మీద ఉండగానే.. వెంకీ నెక్ట్స్ సినిమా క్రిష్తో ఉంటుందన్న ప్రచారం జరిగింది. వీరయ్య టైటిల్తో పీరియాడిక్ డ్రామగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారన్న టాక్ బలంగా వినిపించింది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అదే సమయంలో యంగ్ డైరెక్టర్ కిశోర్ తిరుమలతో ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేసేందుకు ప్లాన్ చేశాడు వెంకీ. కానీ సినిమా కూడా స్టార్ కాలేదు.

తాజాగా వెంకీ నెక్ట్స్ ప్రాజెక్ట్పై మరో ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. సౌత్ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, వెంకటేష్ కోసం కథ రెడీ చేశాడట. ఇటీవల ఒప్పం సినిమాతో సంచలనం సృష్టించిన ప్రియదర్శన్, వెంకీ కోసం స్పెషల్ స్టోరిని రెడీ చేశాడట. రెండు దశాబ్దాల క్రితం నాగార్జునతో నిర్ణయం, బాలకృష్ణతో గాంఢీవం సినిమాలను తెరెక్కించిన ప్రియదర్శన్ తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. ఇన్నేళ్ల తరువాత వెంకటేష్తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే కాంబినేషన్పై ఇంతవరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement