మూడు భాషల్లోకి ప్రియా వారియర్‌ సినిమా  | Priya Prakash Varrier Film To Be Released In Multiple Languages | Sakshi
Sakshi News home page

మూడు భాషల్లోకి ప్రియా వారియర్‌ సినిమా 

Apr 14 2018 4:04 PM | Updated on Aug 28 2018 7:14 PM

Priya Prakash Varrier Film To Be Released In Multiple Languages - Sakshi

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

ఒక్క కనుసైగతో దేశ వాప్తంగా పాపులర్‌ అయిన మళయాల నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ప్రస్తుతం ఆమె నటించిన ఒరు అదార్‌ లవ్‌ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.  దీంతో ప్రియ పాపులారిటీని క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డారు సినిమా దర్శక, నిర్మాతలు. ఈ చిత్రాన్ని మరో మూడు భాషల్లో విడుదల చేయాలని చూస్తున్నారట. 

మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. ఈ సినిమాలో ప్రియకు జోడీగా రోషన్‌ అబ్దుల్‌ రహూఫ్‌ నటిస్తున్నాడు. ఒమర్‌ లులు దర్శకత్వం వహించగా, ఒసెపచ్చన్‌ ఒళకుంజి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రియ పాపులారిటీ దర్శక, నిర్మాతలకు ఏమేరకు లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలిమరి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement