ప్రేమాలయం | Premalayam telugu movie audio launch | Sakshi
Sakshi News home page

ప్రేమాలయం

Mar 3 2019 2:58 AM | Updated on Mar 3 2019 2:58 AM

Premalayam telugu movie audio launch - Sakshi

సిద్ధార్థ్, అనైకా సోఠి

 ‘ప్రేమాలయం’ అనగానే సల్మాన్‌ఖాన్‌ గుర్తొస్తారు. 30 ఏళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా ఇప్పటికీ గుర్తుందంటే ఆ ప్రేమకథ అంత సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే పేరుతో సిద్ధార్థ్, వేదిక, అనైకా సోఠి నాయకా నాయికలుగా నటించిన ‘కావ్యతలైవన్‌’ అనే తమిళ చిత్రం తెలుగులో విడుదల కానుంది. మాణిక్యం ఆర్ట్‌ థియేటర్స్‌ పతాకంపై శ్రీమతి పి. సునీత సమర్పణలో శ్రీధర్‌ యచ్చర్ల తెలుగులోకి అనువదిస్తున్నారు. లవ్‌ స్టోరీస్‌ తెరకెక్కించడంలో స్పెషలిస్ట్‌ అయిన వసంతబాలన్‌ ఈ చిత్రానికి దర్శకుడు.

ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. చిత్ర నిర్మాత సాయివెంకట్‌ బిగ్‌ సిడీని, ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసి నిర్మాత శ్రీధర్‌కు అభినందనలు తెలిపారు. నటులు సోనియా, హుస్సేనప్పా పాటలను విడుదల చేశారు.  ఈ సందర్భంగా చిత్రనిర్మాత శ్రీధర్‌ యచ్చర్ల మాట్లాడుతూ– ‘‘సిద్ధార్థ్‌ హీరోగా నటించి, ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో ప్రముఖ పలయాళ నటుడు పృథ్వీరాజ్‌ విలన్‌గా నటించడం విశేషం’’ అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement