'ప్రేమకు రెయిన్‌ చెక్‌.. కొత్తగా ఉంటుంది' | Premaku Rain Check Teaser Launched | Sakshi
Sakshi News home page

Jul 24 2018 1:11 AM | Updated on Aug 28 2018 4:32 PM

Premaku Rain Check Teaser Launched - Sakshi

శరత్‌ మరార్, ఇంద్రగంటి మోహనకృష్ణ, ఆకెళ్ల పేరి శ్రీనివాస్, ప్రియ, అభిలాష్‌

‘ప్రేమకు రెయిన్‌ చెక్‌’ అంటే.. వర్షం వల్ల ఓ జంటకు వచ్చే అడ్డంకులేమో అనుకుంటాం. కానీ ‘రెయిన్‌ చెక్‌ ’ అంటే ఇచ్చిన ఆఫర్‌ను భవిష్యత్‌లో తీసుకుంటా అని అర్థం అంటున్నారు ఆకెళ్ల శ్రీనివాస్‌.  స్వీయ దర్శకత్వంలో  ఆయన ఈ చిత్రం తెరకెక్కించారు. శరత్‌ మరార్‌ నిర్మాణ సంస్థ నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో, స్టోన్‌ మీడియా ఫిలింస్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

అభిలాష్‌ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనిక తమనం నాయకా నాయికలుగా నటించారు. చిత్ర కథానాయకుడు అభిలాష్‌ మాట్లాడుతూ – ‘‘నా తొలి సినిమా నార్త్‌స్టార్‌ లాంటి పెద్ద సంస్థలో రావటం నా లక్‌ . మా దర్శకుడు ఎంతో ఎంకరేజ్‌ చేశారు. టీజర్‌ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ఆకెళ్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ రంగంలో పనిచేశాను. నా మొదటి సినిమా థీమ్‌ లోగోను ఇంద్రగంటిగారు లాంచ్‌ చేసినందుకు   హ్యాపీగా ఉంది.

త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం. సినిమాకు కంటెంట్, సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ రెండూ ఇంపార్టెంటే. మా సినిమాలో ఈ రెండూ ఉన్నాయి’ అన్నారు. ‘‘ఆకెళ్ల పేరి శ్రీనివాస్‌ నాకు ‘గోల్కొండ హైస్కూల్‌’ సినిమా టైమ్‌లో పరిచయం. తను చేసిన ఈ ఫస్ట్‌ సినిమా టైటిల్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టెక్నికల్‌గా సినిమా వర్క్‌ బావుంది’’ అన్నారు ఇంద్రగంటి. ‘‘టైటిల్‌ ఎంత ఫ్రెష్‌గా ఉందో సినిమా అంతే కొత్తగా ఉంటుంది’’ అన్నారు శరత్‌ మరార్‌. ఈ చిత్రానికి సంగీతం: దీపక్‌ కిరణ్, కెమెరా: శరత్‌ గురువుగారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement