‘ప్రేమ కథా చిత్రమ్‌ 2’ మూవీ రివ్యూ

Prema Katha chitram 2 Telugu Movie Review - Sakshi

టైటిల్ : ప్రేమ కథా చిత్రమ్‌ 2
జానర్ : హారర్‌ కామెడీ
తారాగణం : సుమంత్‌ అశ్విన్‌, సిద్ధీ ఇద్నానీ, నందితా శ్వేత
సంగీతం : జేబీ
దర్శకత్వం : హరి కిషన్‌
నిర్మాత : ఆర్‌ సుదర్శన్‌ రెడ్డి

సుధీర్‌ బాబు, నందిత జం‍టగా తెరకెక్కిన సూపర్‌ హిట్ హారర్‌ కామెడీ ప్రేమ కథాచిత్రం. తాజాగా ఆ సినిమాకు సీక్వల్‌ను తెరకెక్కించారు చిత్రయూనిట్‌. హరి కిషన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో సుమంత్ అశ్విన్‌, నందితా శ్వేత, సిద్ధి ఇద్నాని లు హీరో హీరోయిన్లుగా నటించారు. గతంలో కామెడీ హారర్‌ లు టాలీవుడ్ సక్సెస్‌ ఫార్ములాగా పేరుతెచ్చుకున్న ఇటీవల కాలంలో ఈ జానర్‌లో వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ప్రేమ కథా చిత్రమ్‌ 2 మరోసారి సక్సెస్‌ ఫార్ములాగా ప్రూవ్‌ చేసుకుందా..? ఈ సినిమా అయినా సుమంత్‌ అశ్విన్‌కు సక్సెస్‌ అందించిందా.?

కథ‌ :
డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్న సుధీర్‌ (సుమంత్ అశ్విన్‌)ను కాలేజ్‌లో పరిచయం అయిన బిందు (సిద్ధి ఇద్నాని) ఇష్టపడుతుంది. కానీ సుధీర్ ఆమె ప్రేమను రిజెక్ట్ చేయటంతో బిందు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఆమెను కాపాడిన సుధీర్‌, తాను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాని నచ్చజెప్పి వెళ్లిపోతాడు. తరువాత అనుకోని పరిస్థితుల్లో సుధీర్‌ ఓ ఫాం హౌజ్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఫాం హౌస్‌లో అడుగుపెట్టిన దగ్గర నుంచి సుధీర్‌కు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఓ అమ్మాయి(నందితా శ్వేత) రాత్రి మాత్రమే కనిపిస్తూ సుధీర్‌ని అతని ఫ్రెండ్‌ బబ్లూని బయపెడుతుంటుంది. ఇంతకీ సుధీర్‌ ఆ ఫాం హౌజ్‌కి ఎందుకు వెళ్లాడు? సుధీర్‌ను భయపెడుతున్న ఆ అమ్మాయి ఎవరు? బిందు ఏమైంది.? చివరకు సుధీర్‌ తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాడా..?  అన్నదే మిగతా కథ.


న‌టీన‌టులు :
లవర్‌ బాయ్‌ ఇమేజ్‌తో మెప్పించిన సుమంత్ అశ్విన్‌ హారర్‌ కామెడీతో ఆకట్టుకోలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ కాలేజ్‌ సీన్స్‌లో పరవాలేదనిపించినా క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాల్లో సుమంత్ ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. సిద్ధి ఇద్నాని తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో పరవాలేనిపిస్తుంది. కీలక పాత్రలో నటించిన నందిత శ్వేత నిరాశపరిచింది. చాలా సన్నివేశాల్లో ఆమె నటన అతిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్‌ పాత్రల్లో కనిపించిన కృష్ణతేజ(బబ్లూ), విధ్యుల్లేఖ రామన్‌ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు.

విశ్లేష‌ణ‌ :
ప్రేమ కథా చిత్రమ్‌ సినిమాకు కొనసాగింపుగా కథను తయారు చేసుకున్న దర్శకుడు, ఆ కథను తెర మీదకు తీసుకురావటంలో తడబడ్డాడు. తన కథనంతో ప్రేక్షకులను కన్ఫ్యూజ్‌ చేశాడు. ఫస్ట్ హాఫ్‌ అంతా అసలు ఏ జరుగుతుంది.. ఏ క్యారెక్టర్‌ ఎందుకు వస్తుంది అని ప్రేక్షకుడు అర్థం చేసుకోవడానికే సరిపోతుంది. ద్వితీయార్థంలో కథనం రోలర్‌కోస్టర్‌లా సాగుతూ ప్రేక్షకుడి సహనాన్ని మరింత పరీక్షిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆడియన్స్‌ను భయపెట్టేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నాలన్నీ నవ్వుతెప్పిస్తాయి.‌ సంగీత దర్శకుడు జేబీ తన సంగీతంతో సినిమాను కొంతమేర కాపాడే ప్రయత్నం చేశాడు. పాటలు, నేపథ్యం సంగీతం పరవాలేదనిపిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
కామెడీ

మైనస్‌ పాయింట్స్‌ :
స్క్రీన్‌ప్లే
దర్శకత్వం

సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్‌.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top