పుట్టుకతోనే ప్రేమలో పడ్డారు! | Prema Antha Easy Kadu Movie Press Meet | Sakshi
Sakshi News home page

పుట్టుకతోనే ప్రేమలో పడ్డారు!

Mar 29 2019 3:22 AM | Updated on Mar 29 2019 3:22 AM

Prema Antha Easy Kadu Movie Press Meet - Sakshi

రాజేష్‌ కుమార్, ప్రజ్వల్‌

‘‘నేను చిరంజీవిగారికి పెద్ద ఫ్యాన్‌. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. మా ‘ప్రేమ అంత ఈజీ కాదు’ సినిమాలో కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చాం. తండ్రీ కొడుకుల మధ్య ఎలాంటి బంధం ఉంటుందో ఈ సినిమా అలాగే ఉంటుంది. మన జీవితాలను ప్రతిబింబిస్తుంది. ఇరుగు పొరుగున చూసే చాలా అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి’’ అని డైరెక్టర్‌ ఈశ్వర్‌ అన్నారు. రాజేష్‌ కుమార్, ప్రజ్వల్‌ జంటగా ఈశ్వర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. టి. అంజయ్య సమర్పణలో టి.నరేష్, టి.శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.

టి. అంజయ్య మాట్లాడుతూ– ‘‘ఎప్పటి నుంచో సినిమా తీయాలని మా అబ్బాయిలు అనుకుంటున్నారు. ఈ సినిమా గురించి చెప్పినప్పుడు మంచి సినిమా తీయండి అన్నాను. ప్రేమకు సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి. కానీ, మా సినిమాలో కొత్త కోణంలో ప్రేమను ఆవిష్కరించాం’’ అన్నారు. ‘‘ పుట్టుకతోనే ప్రేమలో పడతారు ఇద్దరు. వారు పెరిగే కొద్దీ వారి ప్రేమ పెరిగిన తీరును ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు నరేష్, శ్రీధర్‌. ‘‘ఎవరైనా మా సినిమాకి రూ.100 పెట్టి టికెట్‌ కొంటే, వారికి రూ.1000 వినోదం దక్కుతుంది’’ అన్నారు రాజేష్‌. ‘‘ఈ చిత్రంలో ప్రేమ అనే మంచి పాత్ర చేశా’’ అన్నారు ప్రజ్వల్‌.

Advertisement
 
Advertisement
Advertisement