ప్రేమ సులభం కాదు | Prema Antha Easy Kadhu Teaser launch | Sakshi
Sakshi News home page

ప్రేమ సులభం కాదు

Mar 19 2019 1:09 AM | Updated on Mar 19 2019 1:09 AM

Prema Antha Easy Kadhu Teaser launch - Sakshi

రాజేశ్, ప్రజ్వాల్‌

‘‘ఖోఖో, ఫ్లా్లష్‌ న్యూస్, వెతికా నేను నా ఇష్టంగా’ వంటి  చిత్రాలతో ప్రతిభ ఉన్న నటుడిగా నిరూపించుకున్న రాజేశ్‌కుమార్‌ హీరోగా నటించిన తాజా చిత్రం  ‘ప్రేమ అంత ఈజీ కాదు’. కన్నడలో మూడు విజయవంతమైన సినిమాల్లో నటించిన ప్రజ్వాల్‌ పువ్వామా ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఈశ్వర్‌ దర్శకత్వం వహించారు. టి.అంజయ్య సమర్పణలో పారిజాత మూవీ క్రియేషన్స్‌ పతాకంపై టి.నరేశ్, టి.శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రేమ నేపథ్యంలో సాగే కథ ఇది. మనసుకి నచ్చిన వ్యక్తి ప్రేమను గెలుచుకోవడం ఎంత కష్టమో తెలుపుతుంది. ప్రేమ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ మధ్య సాగే డ్రామా ఇది. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. త్వరలో పాటల్ని విడుదల చేసి, ఈ నెలాఖరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని అన్నారు. ధన్‌రాజ్, రాంప్రసాద్, ముక్తార్‌ఖాన్‌ నటించిన ఈ చిత్రానికి కెమెరా: చక్రి, సంగీతం: జై.యం.

Advertisement
 
Advertisement
Advertisement