'మా వైవాహిక జీవితానికి ప్రీతిజింటా తెరదించింది'

'మా వైవాహిక జీవితానికి ప్రీతిజింటా తెరదించింది' - Sakshi

ముంబై: లైంగికంగా వేధిస్తున్నారని మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త, ఐపీఎల్ ఫ్రాంచైజీలో సహా భాగస్వామి నెస్ వాడియాపై బాలీవుడ్ నటి, వ్యాపారవేత్త ప్రీతి జింటా ఫిర్యాదు చేయడం తాజాగా సంచలనం రేపింది. గతంలో కూడా ఎలాంటి బెదిరింపులకు తలవొగ్గకుండా పలుమార్లు ఫిర్యాదు చేసి జింటా అందర్నిఆకర్షించారు. ప్రీతి జింటా తన జీవితంలో సంచలనం రేపిన కొన్ని ఘటనలను, ప్రత్యేక సంఘటనలు, వివాదాలు, విశేషాలను ఓసారి పరిశీలిద్దాం.

 

1. 2003లో అండర్ వరల్డ్ మాఫియాపై కోర్టులో ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బాలీవుడ్ లో ఏ హీరో, హీరోయిన్ కూడా మాఫియాకు భయకుండా ప్రీతిలా ఫిర్యాదు చేసిన దాఖలాలు ఇప్పటి వరకు నమోదు కాలేదు. 

 

2. 2005 లో తనపై అమర్యాదపూర్వకంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గొంతుతో వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముంబైకి చెందిన పత్రికపై పరువు నష్టం కేసును ప్రీతిజింటా నమోదు చేసింది. 

 

3. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ తో తన వైవాహిక జీవితానికి తెరపడటానికి కారణం ప్రీతి జింటా అంటూ సుచిత్రా కృష్ణమూర్తి ఆరోపణలు చేసింది. అయితే సుచిత్ర ఆరోపణలకు ధీటుగా స్పందించిన ప్రీతి.. ఆమె మానసిక పరిస్థితి బాగా లేదు అని వ్యాఖ్యలు చేశారు. 

 

4. ఐపీఎల్ క్రేజ్ కు ఆకర్షితురాలై.. బాలీవుడ్ కు దాదాపు గుడ్ బై చెప్పిందనే విమర్శలు వచ్చాయి. 

 

5. 2001లో విడుదలైన 'చోరి చోరి చుప్కే చుప్పే' చిత్రంలో వ్యభిచారి పాత్రను పోషించడమే కాకుండా సర్రోగసి మదర్(అద్దె తల్లి)గా నటించి ప్రీతి జింటా సంచలనానికి తావిచ్చింది. 

 

6. క్యా కహనా చిత్రంలో పెళ్లికాకుండానే తల్లైన పాత్రను పోషించి ప్రీతి జింటా మీడియా దృష్టిని ఆకర్షించింది. 

 

7. మణిరత్నం దర్శకత్వం వహించిన 'దిల్ సే' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రీతిజింటా ఆ చిత్ర హీరో షారుక్ ఖాన్ ను నీవు బ్రహ్మచారివేనా అంటూ ప్రశ్నించడం అనేక విమర్శలకు దారి తీసింది. 

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top