మళ్లీ ‘కాంజీవరం’ కాంబినేషన్! | Prakash Raj teams up with Priyadarshan, again | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘కాంజీవరం’ కాంబినేషన్!

Jul 6 2015 11:18 PM | Updated on Mar 28 2019 6:26 PM

మళ్లీ ‘కాంజీవరం’ కాంబినేషన్! - Sakshi

మళ్లీ ‘కాంజీవరం’ కాంబినేషన్!

కాంజీవరం’ గుర్తుందా? ప్రకాశ్‌రాజ్‌కు ఉత్తమ నటునిగా జాతీయ పురస్కారం తీసుకొచ్చిన తమిళ చిత్ర మిది.

‘కాంజీవరం’ గుర్తుందా? ప్రకాశ్‌రాజ్‌కు ఉత్తమ నటునిగా జాతీయ పురస్కారం తీసుకొచ్చిన తమిళ చిత్ర మిది. ఇందులో చేనేత కార్మికునిగా ఆయన నటన ప్రశంసలందుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ దీనికి సృష్టికర్త. ‘కాంజీవరం’ తర్వాత ప్రకాశ్‌రాజ్-ప్రియదర్శన్ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా రాలేదు. ఆ లోటును భర్తీ చేస్తూ ఆరేళ్ల తర్వాత ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఇటీవలే ప్రియదర్శన్ చెప్పిన కథ విని ప్రకాశ్‌రాజ్ విపరీతంగా ఇంప్రెస్ అయ్యారట. త్వరలోనే మొదలుకానున్న ఈ సినిమాకు ‘కాంజీవరం’ టీమ్‌లోని టెక్నీషియన్లు చాలామంది పనిచేయనున్నారట. ఆ వివరాల కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement