ప్రకాష్రాజ్ చెబుతున్న రామాయణం | Prakash raj next directorial movie mana oori ramayanam | Sakshi
Sakshi News home page

ప్రకాష్రాజ్ చెబుతున్న రామాయణం

Nov 22 2015 10:31 AM | Updated on Sep 3 2017 12:51 PM

ప్రకాష్రాజ్ చెబుతున్న రామాయణం

ప్రకాష్రాజ్ చెబుతున్న రామాయణం

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి మెగాఫోన్ పట్టబోతున్నాడు. నటుడిగా ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోసిన ప్రకాష్ రాజ్ తరువాత నిర్మాతగా, దర్శకుడిగా కూడా తన మార్క్...

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి మెగాఫోన్ పట్టబోతున్నాడు. నటుడిగా ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోసిన ప్రకాష్ రాజ్ తరువాత నిర్మాతగా, దర్శకుడిగా కూడా తన మార్క్ చూపించాడు. ఆకాశమంత, గగనం లాంటి సినిమాలను నిర్మించిన ప్రకాష్ రాజ్.. తరువాత ధోని, ఉలవచారు బిర్యాని లాంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలు కమర్షియల్గా పెద్దగా ఆకట్టుకోకపోయినా ప్రకాష్ రాజ్ అభిరుచికి మాత్రం మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.

మరోసారి మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నాడు ప్రకాష్ రాజ్. కన్నడ, తెలుగు భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న ఈ సినిమాకు తెలుగులో మన ఊరి రామాయణం అనే టైటిల్ను ఫైనల్ చేశాడు. శనివారం ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను తన ట్విట్టర్లో విడుదల చేశాడు. తన సొంత నిర్మాణ సంస్థ ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు.

ఫస్ట్ లుక్ పోస్టర్ను చూస్తే ఈ సినిమా డ్రామా వారి జీవితాల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇటీవలే ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రకాష్ రాజ్ అక్కడి ప్రజల జీవన స్థితిగతులను కూడా ఈ సినిమాలో చూపించే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అందుకే సినిమా టైటిల్ను మన ఊరి రామయణం అని పెట్టినట్టుగా విశ్లేషిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement