రామ్‌చరణ్‌కు తాతగా...

రామ్‌చరణ్‌కు తాతగా...


 మహేశ్ ‘ఆగడు’ నుంచి బయటకొచ్చిన ప్రకాశ్‌రాజ్... రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలోకి ఫ్రెష్‌గా ఎంటరయ్యారు. మూడు తరాల కథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ తాతగా ప్రకాశ్‌రాజ్ కనిపించనున్నారు. ఈ పాత్రకు ముందు తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ని తీసుకున్నారు. రాజ్‌కిరణ్‌తో పలు కీలక సన్నివేశాలను కూడా దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించారు. అయితే ఏమైందో ఏమో... ఇప్పుడు రాజ్‌కిరణ్ స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ను తీసుకున్నారు. అలాగే, పైకి ప్రకటించని కొన్ని కారణాల వల్ల చిత్రీకరణకు విరామం ప్రకటించిన ఈ టీమ్ త్వరలోనే మళ్ళీ సెట్స్‌కి వెళ్లనుంది. మరి, ఇందులో చరణ్ తండ్రి పాత్ర పోషించే నటుడెవరో తెలియాల్సి ఉంది.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top