విడాకులు తీసుకున్న దర్శకేంద్రుడి కుమారుడు!? | Is Prakash Kovelamudi And Kanika Dhillon Divorce 2 Years Back | Sakshi
Sakshi News home page

ప్రకాశ్‌-కనికా విడిపోయారంటూ ప్రచారం

Aug 2 2019 2:47 PM | Updated on Aug 2 2019 3:21 PM

Is Prakash Kovelamudi And Kanika Dhillon Divorce 2 Years Back - Sakshi

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాశ్‌ కోవెలమూడి విడాకులు తీసుకున్నారనే వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాశ్‌ కోవెలమూడి విడాకులు తీసుకున్నారనే వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రకాశ్‌ - కనికా ధిల్లాన్‌ విడిపోయారంటూ ఆంగ్ల వెబ్‌సైట్లు వార్తలు ప్రచురించాయి. వీరిద్దరు కలిసి పని చేసిన తాజా చిత్రం ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ షూటింగ్‌ ప్రారంభానికి ముందే ఈ జంట విడిపోయినట్లు సమాచారం‌. విడిపోయి రెండేళ్లు అవుతున్నా.. సినిమా కోసం కలిసి పని చేశారంటూ ప్రచారం జరుగుతుంది. ‘‘జడ్జిమెంటల్‌ హై క్యా’ చిత్రం షూటింగ్‌ కంటే ముందే.. అంటే 2017లోనే మేం విడిపోయాం’ అంటూ ఇద్దరు ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేసినట్లు ఇండియాటుడే ఓ వార్త ప్రచురించింది.

ఈ విషయం గురించి ప్రకాశ్‌ కోవెలమూడి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోనే సెటిల్‌ అయ్యాను. కనికా మాత్రం రెండేళ్ల క్రితమే ముంబై షిప్ట్‌ అయ్యింది’ అని పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయంపై కనికా ఎక్కువగా స్పందించలేదని తెలుస్తోంది. ‘విడిపోయారు కదా.. కలిసి పని చేస్తారా’ అని విలేకరులు ఆమెను ప్రశ్నించగా.. ‘తప్పకుండా. జడ్జిమెంటల్‌ హై క్యా సినిమా కోసం కలిసి పని చేశాం.. విజయం కూడా సాధించాం కదా. తప్పకుండా మరో ప్రాజెక్ట్‌ కోసం కలిసి పని చేస్తామని’ కనికా పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో వీరిద్దరి నుంచి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కాగా కంగనా రనౌత్, రాజ్‌కుమార్‌ రావు జంటగా నటించిన ‘జడ్జిమెంటల్ హై క్యా’ చిత్రానికి ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వం వహించగా.. కనికా కథా సహకారం అందించారు. వీరిద్దరూ 2014లో వివాహ బంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement