వారితో నటించడం మంచి అనుభూతి | Prabhu Deva Comments On Lakshmi Movie | Sakshi
Sakshi News home page

వారితో నటించడం మంచి అనుభూతి : ప్రభుదేవా

Mar 16 2018 1:09 AM | Updated on Mar 16 2018 9:18 AM

Prabhu Deva Comments On Lakshmi Movie - Sakshi

‘‘దర్శకుడు విజయ్‌తో ‘అభినేత్రి’ సినిమా చేయడం గొప్ప అనుభవం. ‘అభినేత్రి 2’ కూడా చేద్దామనుకున్నాం. ఆ సమయంలో ‘లక్ష్మి’ కథ విన్నా. బాగా నచ్చింది. ఇలాంటి సినిమాకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. శ్యామ్‌ అద్భుతమైన సంగీతం అందించారు’’ అని ప్రభుదేవా అన్నారు. ప్రభుదేవా, ఐశ్వర్యా రాజేష్‌ జంటగా ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్‌.రవీంద్రన్‌ నిర్మిస్తోన్న ‘లక్ష్మీ’ చిత్రం టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు.

ప్రభుదేవా మాట్లాడుతూ– ‘‘డ్యాన్స్‌ బేస్డ్‌ ఫిల్మ్‌ చేయాలని విజయ్‌ అంటే ఓ రేంజ్‌లో చేయాలనుకున్నా. నిర్మాతలు కూడా నా అభిప్రాయాన్ని అర్థం చేసుకుని మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ఈ సినిమాలో నటించిన పిల్లలను ఇండియా మొత్తం నుంచి ఎంపిక చేశారు. వారు బాగా నటించారు. వారితో నటించడం మంచి అనుభూతినిచ్చింది’’ అన్నారు. ‘‘ప్రభుదేవా డ్యాన్సింగ్‌ లెజెండ్‌. ఆయనతో ఎప్పుడు సినిమా చేసినా ఓ లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌’’ అన్నారు దర్శకుడు విజయ్‌. ‘‘భవిష్యత్‌లో తెలుగు, తమిళంలో మరిన్ని సినిమాలు చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: నిరవ్‌ షా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: గణేశ్, ఓమార్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement