దుమ్ము రేపనున్న ‘సాహో’ క్లైమాక్స్‌! | Prabhas will fight with 100 fighters in Saaho Climax Scene | Sakshi
Sakshi News home page

‘సాహో’క్లైమాక్స్‌ ఇంత భారీగానా!!

Jul 22 2019 3:08 PM | Updated on Jul 22 2019 5:00 PM

Prabhas will fight with 100 fighters in Saaho Climax Scene - Sakshi

బాహుబలితో రికార్డులన్నీ కొల్లగొట్టిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ తాజాగా ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రన్‌ రాజా రన్‌ ఫేమ్‌ సుజిత్‌ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు నిర్మించారు. ఇప్పటికే చిత్ర యునిట్‌ విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌లతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా సాహోను చిత్ర నిర్మాతలు భారీగానే నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ సినీ వర్గాలతో పాటు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

‘సాహో’క్లైమాక్స్‌ను చరిత్రలో ఎవరూ ఊహించని విధంగా భారీగా తీసేందుకు సుజిత్‌ అండ్‌ గ్యాంగ్‌ రెడీ అయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందమంది అంతర్జాతీయ ఫైటర్స్‌తో క్లైమాక్స్‌ సీన్‌లు చిత్రీకరిస్తున్నారట. ఈ ఫైట్‌ కోసం భారీ సెట్‌ను కూడా రూపొందించారట. కేవలం క్లైమాక్స్‌ సీన్‌ కోసమే నిర్మాతలు ఏకంగా 70 కోట్ల బడ్టెట్‌ను వెచ్చిస్తున్నారట. పెంగ్‌ జాంగ్‌ ఈ ఫైట్‌ని కంపోజ్‌ చేశారు. చలనచిత్ర చరిత్రలోనే క్లైమాక్స్‌ కోసం ఇంత భారీ బడ్జెట్‌ కేటాయిస్తున్న సాహో అంటూ చిత్ర యునిట్‌ ప్రకటించింది. ముందుగా ఈ చిత్రం ఆగస్ట్‌ 15న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ భారీ ఫైట్‌, గ్రాఫిక్స్‌ కారణంగా చిత్రాన్ని ఆగస్ట్‌ 30కి వాయిదా వేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement