వాట్ నెక్ట్స్..!? | Prabhas to Work under Sujith's Direction | Sakshi
Sakshi News home page

వాట్ నెక్ట్స్..!?

Sep 2 2016 10:24 PM | Updated on Sep 4 2017 12:01 PM

వాట్ నెక్ట్స్..!?

వాట్ నెక్ట్స్..!?

‘మిర్చి’తోనే యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రారంభమైంది. నిర్మాతలు ప్రమోద్, వంశీ.. ఇద్దరూ ప్రభాస్ స్నేహితులే.

 ‘మిర్చి’తోనే యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రారంభమైంది. నిర్మాతలు ప్రమోద్, వంశీ.. ఇద్దరూ ప్రభాస్ స్నేహితులే. ‘మిర్చి’ తర్వాత ప్రభాస్ హీరోగా మరో సినిమా తీయాలని ఈ స్నేహితులిద్దరూ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యం. ‘బాహుబలి’ షూటింగ్ పూర్తయిన తర్వాతే ప్రభాస్ ఓకే అంటారని అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.
 
  కానీ, వాట్ నెక్ట్స్? ‘బాహుబలి’ తర్వాత ఎలాంటి సినిమాలో నటించబోతున్నారు? అంటే ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వనున్నారు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ సినిమా నిర్మించనుందనే సంగతి తెలిసిందే. సుజీత్ స్క్రిప్ట్ పక్కాగా రెడీ చేశారు. థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. సో.. ప్రభాస్ నటించనున్న ఫస్ట్ థ్రిల్లర్ మూవీ ఇదే అవుతుందని చెప్పొచ్చు. ఇది కాకుండా.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement