ఒప్పందం కుదిరింది! | Prabhas, Shraddha Kapoor strike a deal for Saaho | Sakshi
Sakshi News home page

ఒప్పందం కుదిరింది!

Sep 7 2017 12:52 AM | Updated on Jul 17 2019 10:14 AM

ఒప్పందం కుదిరింది! - Sakshi

ఒప్పందం కుదిరింది!

‘ఆప్‌ కా నామ్‌ క్యా హై’... అంటే మీ పేరేంటి? అని అర్థం.

‘ఆప్‌ కా నామ్‌ క్యా హై’... అంటే మీ పేరేంటి? అని అర్థం. కొంచెం కొంచెం హిందీ వచ్చినవాళ్లకు ఈ ప్రశ్న కచ్చితంగా తెలుస్తుంది. అంతకు మించి మాట్లాడమంటే... సైలెంట్‌ అయిపోవాల్సిందే. ఇక తెలుగు తెలియనివాళ్లకు అయితే ఇది కూడా తెలియదు. హిందీ రాని ప్రభాస్, తెలుగు రాని శ్రద్ధాకపూర్‌ ఈ కోవకే చెందుతారు.

తాజాగా సెట్స్‌ మీద ఉన్న ‘సాహో’లో ప్రభాస్‌ సరసన ఈ శ్రద్ధా కథానాయికగా కమిట్‌ అయిన విషయం తెలిసిందే. సుజిత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం దర్శకుడు సుజిత్‌ చాలా మంది యాక్టర్లు, టెక్నీషియన్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రభాస్‌ మాత్రం శ్రద్ధాకపూర్‌తో ఓ డీల్‌ సెట్‌ చేసుకున్నారట. ‘

సాహో’ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే.ప్రభాస్‌కు హిందీ అంతగా రాదు. శ్రద్ధాకపూర్‌కు తెలుగు తెలీదు. సో...సెట్‌లో లాంగ్వేజ్‌ ప్రాబ్లమ్‌ రాకుండా ప్రభాస్‌కు శ్రద్ధా హిందీ నేర్పిస్తే, శ్రద్ధాకు ప్రభాస్‌ తెలుగు నేర్పించేలా ఇద్దరూ డీల్‌ చేసుకున్నారట. అయితే తెలుగు వెర్షన్‌ ‘సాహో’లో శ్రద్ధాకు డబ్బింగ్‌ వేరే వారు చెబుతారు. అలాగే హిందీ వెర్షన్‌లో ప్రభాస్‌కు వేరే వారు డబ్బింగ్‌ చెబుతారు. అంతే కదా.. కొన్ని నెలలు భాష నేర్చుకున్నంత మాత్రాన డబ్బింగ్‌ చెప్పలేరు కదా.

Advertisement
 
Advertisement
Advertisement