సాహో కోసం రిస్క్ చేస్తున్న ప్రభాస్..! | Prabhas Scuba Diving for Saaho | Sakshi
Sakshi News home page

సాహో కోసం రిస్క్ చేస్తున్న ప్రభాస్..!

Aug 30 2017 10:28 AM | Updated on Sep 17 2017 6:09 PM

సాహో కోసం రిస్క్ చేస్తున్న ప్రభాస్..!

సాహో కోసం రిస్క్ చేస్తున్న ప్రభాస్..!

బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్, తన నెక్ట్స్ సినిమా కూడా అదే స్థాయిలో ఉండేలా

బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్, తన నెక్ట్స్ సినిమా కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే సాహో సినిమా షూటింగ్ ను ప్రారంభించిన డార్లింగ్.. ఈ సినిమాను హాలీవుడ్ స్థాయి యాక్షన్ డ్రామాగా రూపొందించే పనిలో ఉన్నాడు. అందుకోసం కొన్ని రిస్క్ స్టంట్స్ కూడా చేస్తున్నాడట. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ యాక్షన్ సీక్వన్స్ కోసం స్కూబా డైవింగ్ చేస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. యువి క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా 150 కోట్లతో బడ్జెట్ తో రూపొందిస్తున్న  ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఇషాన్ లాయ్ లు సంగీతమందిస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ స్టార్స్ నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండేలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement