మేలో పూర్తి | Prabhas Saaho Release Date on 15th August 2019 | Sakshi
Sakshi News home page

మేలో పూర్తి

Mar 18 2019 12:30 AM | Updated on Jul 17 2019 10:14 AM

Prabhas Saaho Release Date on 15th August 2019 - Sakshi

ప్రభాస్‌

‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్‌ చేస్తున్న సినిమా ‘సాహో’. సుమారు 300 కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ సైన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్‌ కథానాయిక.

మూడు పాటలు, ఓ యాక్షన్స్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ మినహా, మిగతా షూటింగ్‌ మొత్తం మే నెలలోపు పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోందని సమాచారం. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కూడా ఎక్కువ ఉండటంతో పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా సమాంతరంగా ప్లాన్‌ చేయనున్నారట. మురళీశర్మ, జాకీ ష్రాఫ్, ఎవ్లీన్‌ శర్మ, నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, మందిర బేడీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 15న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: శంకర్‌ ఎహాసన్‌ లాయ్, కెమెరా: మది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement