ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ | Prabhas Saaho Eid Special Teaser | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

May 30 2019 11:57 AM | Updated on May 30 2019 11:57 AM

Prabhas Saaho Eid Special Teaser - Sakshi

యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సాహో. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌. అయితే చివరి నిమిషంలో చిత్ర సంగీత దర్శకులు శంకర్‌ ఇషాన్‌ లాయ్‌లు ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు.

దీంతో సినిమా విడుదల ఆలస్యమవుతుందన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే వార్తలపై చిత్ర దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాహో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు. అంతేకాదు ఈద్‌ సందర్భంగా జూన్‌ 5న సాహో కొత్త టీజర్‌ను రిలీజ్ చేయనున్నారట. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన భారత్‌ సినిమాతో పాటు సాహో టీజర్‌ను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రన్ రాజా రన్‌ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ  శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా మరో బ్యూటీ ఇవ్లిన్‌ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement