మోదీ బయోపిక్‌ కోసం ప్రభాస్‌

Prabhas Releases The First Look of Narendra Modi Biopic Mann Bairagi - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన బయోపిక్‌కు సంబంధించిన ప్రకటన ఇచ్చారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్‌ లీలా బన్సాలీ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రూపొదించనున్నారు. అయితే తొలి ప్రకటనతోనే సినిమాపై అంచనాలు పెంచేందుకు తొలి పోస్టర్‌ను ఓ ప్యాన్‌ ఇండియా స్టార్‌తో రిలీజ్ చేయించాలనుకున్న బన్సాలీ, ఆ బాధ్యతను బాహుబలి ప్రభాస్‌కు అప్పగించారు.

బాహుబలి, సాహో సినిమాలతో జాతీయ స్థాయిలో తన మార్కెట్ స్టామినాను ప్రూవ్‌ చేసుకున్న ప్రభాస్‌, తన సోషల్‌ మీడియా పేజ్‌ ద్వారా మోదీ బయోపిక్‌  ‘మన్‌ బైరాగి’ ఫస్ట్‌ లుక్‌ను లాంచ్‌ చేశారు. తెలుగు పోస్టర్‌ను ప్రభాస్‌రిలీజ్ చేయగా హిందీ పోస్టర్‌ను అక్షయ్‌ కుమార్ విడుదల చేశారు. సంజయ్‌ త్రిపాఠి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహావీర్‌ జైన్‌తో కలిసి సంజయ్ నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top