ప్రభాస్ మరో సినిమా మొదలెడుతున్నాడు..! | Prabhas Is Ready To Shoot For His Next | Sakshi
Sakshi News home page

ప్రభాస్ మరో సినిమా మొదలెడుతున్నాడు..!

Oct 5 2017 11:44 AM | Updated on Oct 5 2017 2:13 PM

Prabhas

ప్రస్తుతం సాహో షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను మొదలెట్టేందుకు రెడీ అవుతున్నాడు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది.

ఇప్పటికే తన నెక్ట్స్ సినిమాను ఖరారు చేసిన ప్రభాస్ ఆ సినిమాను కూడా పట్టాలెక్కించనున్నాడట. ఫిబ్రవరి వరకు సాహో షూటింగ్ మేజర్ పార్ట్ పూర్తయిపోతుంది కాబట్టి ఫిబ్రవరిలో కొత్త సినిమా స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాను కూడా యువీ క్రియేషన్స్ సంస్థే నిర్మించనుంది. ఈ సినిమా పీరియాడిక్ ఫాంటసీ డ్రామాగా రూపొందనుందన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement