బ్రేక్‌ తర్వాత జాన్‌

prabhas next movie john will be shooting on last week this month - Sakshi

‘సాహో’ వంటి భారీ యాక్షన్‌ మూవీ తర్వాత ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). 1970 నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ఈ నెల  నాలుగో వారంలో ప్రారంభం కానుందని సమాచారం. ఎమోషన్, సెంటిమెంట్‌ అంశాలకు మాస్‌ ఎలిమెంట్స్‌ జోడించి ఈ కథను సిద్ధం చేశారట రాధాకృష్ణ. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. హాలిడేలో భాగంగా ప్రభాస్‌ ప్రస్తుతం ప్యారిస్‌లో ఉన్నారని తెలిసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top