ప్రభాస్ సినిమాపై ఇంట్రస్టింగ్ అప్ డేట్ | Prabhas Next Movie Based on Astrology | Sakshi
Sakshi News home page

ప్రభాస్ సినిమాపై ఇంట్రస్టింగ్ అప్ డేట్

Oct 3 2017 11:13 AM | Updated on Oct 3 2017 11:52 AM

Prabhas Next Movie Based on Astrology

బాహుబలి సక్సెస్ తో ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, ఆ ఇమేజ్ ను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందుకే తన తదుపరి చిత్రాలన్నీ జాతీయ స్థాయి చిత్రాలుగా రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సాహోను భారీ బడ్జెట్ తో తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు.

సాహో తరువాత చేయబోయే సినిమా కూడా అదే స్థాయిలో ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. సాహో తరువాత జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. మరోసారి యువీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమా జోతిష్య శాస్త్రం, హస్త సాముద్రికం నేపథ్యంలో తెరకెక్కనుందట. పీరియాడిక్ ఫాంటసీగా తెరకెక్కనున్న సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతమందిచనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement