ఘనంగా కృష్ణంరాజు బర్త్‌డే వేడుకలు

Prabhas In Krishnam Raju Birthday Celebrations - Sakshi

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తోపాటు మెగాస్టార్‌ చిరంజీవి, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు కుటుంబసభ్యులతోపాటు ఇతర సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా సరదాగా గడిపారు.  ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలను మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అలాగే ప్రభాస్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసిన లక్ష్మి.. ‘ మనం ఎంత క్యూట్‌గా ఉన్నాం ప్రభాస్?‌’ అని అడిగారు. అయితే ఈ పార్టీకి హాజరైన మోహన్‌బాబు, ప్రభాస్‌, విష్ణులు బ్లాక్‌ డ్రెస్‌ కోడ్‌తో కనిపించారు. 

పెద్దనాన్న సినీ వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్‌.. ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జాన్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. తాజా ఫొటోలను గమనిస్తే ప్రభాస్‌ కొద్దిగా బరువు తగ్గినట్టుగా కనిపిస్తున్నాడు. దీంతో ప్రభాస్‌ కొత్త సినిమా లుక్‌ ఇదేనని అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top