అతడు నిజంగానే డై హార్డ్‌ ఫ్యాన్‌ | Prabhas Fan Made Prabhas Image By Rubiks Cubes | Sakshi
Sakshi News home page

అతడు నిజంగానే డై హార్డ్‌ ఫ్యాన్‌

Aug 25 2019 6:32 PM | Updated on Aug 25 2019 6:47 PM

Prabhas Fan Made Prabhas Image By Rubiks Cubes - Sakshi

సాహో చిత్రంలోంచి డై హార్డ్‌ఫ్యాన్స్‌ అనే డైలాగ్‌ ప్రస్తుతం ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. అది ప్రభాస్‌ అభిమానుల కోసం దర్శకుడు ప్రత్యేకంగా రాసిన సంగతి తెలిసిందే. డార్లింగ్‌కు బయట నిజంగానే డై హార్డ్‌ ఫ్యాన్స్‌ ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సిరీస్‌తో జాతీయస్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్న ప్రభాస్‌కు.. దేశమంతటా అభిమానులు ఉన్నారు. తాజాగా ఓ అభిమాని చేసిన పనితో.. అతను ఓన్లీ ఫ్యాన్‌ కాదు డై హార్డ్‌ ఫ్యాన్‌ అని తెలుస్తోంది.

ఒరిస్సాకు చెందిన ఓ అభిమాని 486 రూబిక్‌ క్యూబ్స్‌తో దాదాపు 13 గంటలు శ్రమించి.. ప్రబాస్‌ ముఖచిత్రం వచ్చేట్లుగా సమకూర్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇక సాహో రికార్డుల విషయానికొస్తే.. సెకన్లలో టిక్కెట్లు అమ్ముడైపోతున్నట్టు తెలుస్తోంది. బుక్‌మైషోలో సాహోకు 360k (3,60,000) లైక్స్‌ వచ్చినట్లు పేర్కొంది. బాలీవుడ్‌లో ఖాన్‌ చిత్రాలకు మాత్రం 150-200k లైక్స్‌ వస్తాయని ..కానీ సాహో మాత్రం వారి సినిమాలను దాటేసిందని తెలిపింది. సుజీత్‌ తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ నిర్మించింది. ఈ మూవీ ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement