ప్రభాస్‌ అభిమానులకు డబుల్‌ ట్రీట్‌ | Prabhas Birthday Gift for Fans From Saaho Team | Sakshi
Sakshi News home page

Oct 14 2018 12:29 PM | Updated on Oct 14 2018 12:29 PM

Prabhas Birthday Gift for Fans From Saaho Team - Sakshi

బాహుబలి సినిమా తరువాత మరోసారి ప్రభాస్‌ లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నాడు. దీంతో యంగ్ రెబల్‌ స్టార్‌ అభిమానులు ప్రభాస్‌ కొత్త సినిమా అప్‌డేట్‌ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందే సాహో సినిమా టీజర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తరువాత కేవలం ఒక్క పోస్టర్‌తోనే సరిపెట్టారు. అయితే ఈ సారి ప్రభాస్‌ పుట్టిన రోజు కానుక టీజర్‌తో అభిమానులకు ట్రీట్‌ ఇవ్వనున్నారట సాహో టీం.

ఈ నెల 23న ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఒక్క రోజు ముందుగానే 22న సాహో సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు సాహో టీం ప్లాన్‌ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సాహో షూటింగ్‌ పూర్తి చేసిన ప్రభాస్, రాధకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాను కూడా ప్రారంభించాడు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ కూడా అదే రోజు రిలీజ్‌ చేసే ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది.

యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సాహో సినిమాకు రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్ దర్శకుడు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. హాలీవుడ్ స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్స్‌ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్‌నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement