బాహుబలి 2ని అలా వాడేస్తున్నారు..! | Prabhas and Sujiths Film Teaser with Baahubal 2 | Sakshi
Sakshi News home page

బాహుబలి 2ని అలా వాడేస్తున్నారు..!

Mar 1 2017 10:12 AM | Updated on Sep 5 2017 4:56 AM

బాహుబలి 2ని అలా వాడేస్తున్నారు..!

బాహుబలి 2ని అలా వాడేస్తున్నారు..!

ప్రస్తుతం తెలుగు సినిమా అభిమానులతో పాటు జాతీయ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తున్న సౌత్ సినిమా బాహుబలి. ఇప్పటికే

ప్రస్తుతం తెలుగు సినిమా అభిమానులతో పాటు జాతీయ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తున్న సౌత్ సినిమా బాహుబలి. ఇప్పటికే తొలి భాగం ఘనవిజయం సాధించటంతో రెండో భాగం కోసం అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నారు. యూనిట్ సభ్యులు, తొలి భాగాన్ని మించిన ఎన్నో అద్భుతాలు రెండో భాగంలో ఉంటాయంటూ ప్రచారం చేస్తుండటం సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తోంది. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు హీరో ప్రభాస్.

దాదాపు నాలుగేళ్లుగా బాహుబలికే అంకితం అయిపోయిన ప్రభాస్, ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించే పనిలో ఉన్నాడు. 150 కోట్ల భారీ బడ్జెట్తో అంతర్జాతీయ స్ధాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మేలో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ లోగా సినిమా మీద అంచనాలు పెంచేందుకు బాహుబలి సినిమాను వాడుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే మార్చిలో కొత్త సినిమాకు సంబంధించిన టీజర్ను షూట్ చేసి.. ఆ టీజర్ను బాహుబలి 2తో పాటు రిలీజ్ చేసేందుకు  ప్లాన్ చేశారు.

మార్చి నెలలోనే ఈ షూటింగ్ను ముగించేసి బాహుబలి రిలీజ్ వరకు టీజర్ను రెడీ చేసేందుకు యూనిట్ రెడీ అవుతోంది. టీజర్ కోసమే భారీ బడ్జెట్ను కేటాయించారట. ఈ న్యూస్తో ప్రభాస్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. దాదాపు నాలుగేళ్లుగా ప్రభాస్ బాహుబలిగానే చూస్తున్న ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ప్లాన్ చేశాడు డార్లింగ్. బాహుబలి లుక్తో పాటు స్టైలిష్ యాక్షన్ హీరోగానూ అలరించనున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement