బాసూ... దాసూ... ఇది నిజమేనా? | Prabhas and AR Murugadas are going to make the film a new Khabar. | Sakshi
Sakshi News home page

బాసూ... దాసూ... ఇది నిజమేనా?

Sep 2 2017 1:02 AM | Updated on Aug 20 2018 3:40 PM

బాసూ... దాసూ... ఇది నిజమేనా? - Sakshi

బాసూ... దాసూ... ఇది నిజమేనా?

బాసు అండ్‌ దాసు కలసి సినిమా చేస్తున్నారటగా!?... హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ అండ్‌ చెన్నై కోడంబాక్కమ్‌ వర్గాల్లో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌.

బాసు అండ్‌ దాసు కలసి సినిమా చేస్తున్నారటగా!?... హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ అండ్‌ చెన్నై కోడంబాక్కమ్‌ వర్గాల్లో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌. అసలు ఈ ఇద్దరూ కలసి సినిమా చేస్తే, రిజల్ట్‌ ఎలా ఉంటుంది? ఇంకోసారి ఇండియన్‌ బాక్సాఫీస్‌ షేకవడం ఖాయమేనంటూ కొందరు లెక్కలు కూడా వేస్తున్నారు. ఎందుకంటే... ఇద్దరికీ దేశవ్యాప్తంగా మంచి క్రేజ్, మార్కెట్‌ ఉన్నాయి. ఇంతకీ, ఇక్కడ బాసు అంటే ఎవరో తెలుసా? ‘బాహుబలి’తో ఇండియన్‌ బాక్సాఫీస్‌ లెక్కలను తిరగరాసిన ప్రభాస్‌. దాసు అంటే... కమర్షియల్‌ సిన్మాలకు కంటెంట్‌ కమ్‌ మెసేజ్‌తో కొత్త లెక్కలు చెబుతున్న తమిళ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌.

వీళ్లిద్దరూ సినిమా చేయనున్నారనేది తాజా ఖబర్‌. ఈ సినిమా 2019లో సెట్స్‌పైకి వెళ్తుందట! ఆల్రెడీ ప్రభాస్, మురుగదాస్‌లు ఓసారి కలసి సినిమా గురించి డిస్కస్‌ చేశారట. ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ చేస్తున్నారు. దీని తర్వాత ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. ఈ నెల 27న విడుదలవుతోన్న ‘స్పైడర్‌’ తర్వాత తమిళంలో విజయ్‌ హీరోగా సినిమా చేయనున్నారు మురుగదాస్‌. ఆ తర్వాతే ఇద్దరి కలయికలో సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈలోపు కథాకమామీషు కరెక్టుగా సెట్‌ కావాలి. ఈ వార్త నిజమో? కాదో? బాసు అండ్‌ దాసులే చెప్పాలి!!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement