మహేశ్ బాబుతో... | Poorna's special song in Mahesh's film | Sakshi
Sakshi News home page

మహేశ్ బాబుతో...

Jan 10 2015 11:35 PM | Updated on Sep 2 2017 7:30 PM

మహేశ్ బాబుతో...

మహేశ్ బాబుతో...

‘సీమ టపాకాయ్’, ‘అవును’ తదితర చిత్రాల్లో కథానాయికగా చేసిన పూర్ణ గుర్తుంది కదూ!

 ‘సీమ టపాకాయ్’, ‘అవును’ తదితర చిత్రాల్లో కథానాయికగా చేసిన పూర్ణ గుర్తుంది కదూ! ఆమె ఇప్పుడు మహేశ్‌బాబుతో సినిమా చేయనున్నారు. కథానాయిక కాదండోయ్! ఐటెమ్ సాంగ్‌లో మహేశ్‌తో కలిసి నర్తించనున్నారు. మహేశ్‌బాబు-కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో ఆమె ఐటమ్ సాంగ్ చేస్తున్నారట. మహేశ్ లాంటి సూపర్‌స్టార్ పక్కన నటించడమే కాదు, నర్తించడం కూడా గొప్ప అవకాశంగానే భావిస్తుంటారు కథానాయికలు. ఇటీవల ‘ఆగడు’లో శ్రుతీహాసన్ అలాంటి ఛాన్సే కొట్టేశారు.
 
 ఆ వెంటనే కొరటాల శివ, మహేశ్‌ల సినిమాలో కథానాయికగా బుక్కయ్యారు. ఇప్పుడు ‘సీమ టపాకాయ్’ పూర్ణ వంతు వచ్చింది. కొరటాల శివ- మహేశ్‌ల చిత్రంలోని ఐటమ్ సాంగ్‌లో  పూర్ణ నర్తించనున్నారు. ఇంతమంది కథానాయికలుండగా, పూర్ణనే కొరటాల శివ ఎంచుకోవడానికి కారణం ఏంటి? అనే విషయంలోకెళ్తే- కథలో ఆ పాట చాలా కీలకమట. పైగా ఆ పాటలో అక్కడక్కడ శాస్త్రీయ నృత్యాన్ని కూడా ప్రదర్శించాలట. పూర్ణ స్వతహాగా ప్రొఫెషనల్ డాన్సర్. పైగా శాస్త్రీయ నృత్యంలో ఆమెకు చక్కని ప్రవేశం ఉంది. అందుకే.. ఏరి కోరి పూర్ణాని ఎంచుకున్నారట.
 

Advertisement
 
Advertisement
Advertisement