పేదవాడు కోటీశ్వరుడు కాగలడా? | poor can be a billionaire ? | Sakshi
Sakshi News home page

పేదవాడు కోటీశ్వరుడు కాగలడా?

May 5 2016 5:55 AM | Updated on Sep 3 2017 11:28 PM

పేదవాడు కోటీశ్వరుడు కాగలడా?

పేదవాడు కోటీశ్వరుడు కాగలడా?

ఒక గుడిసె ప్రాంతానికి చెందిన అనాథ కోటీశ్వరుడు అవ్వగలడా?అలాంటి కథాంశంతో తెరకెక్కిన చిత్రం స్లమ్‌డాగ్ కోటీశ్వరన్. అది ముంబయి నగరం.

ఒక గుడిసె ప్రాంతానికి చెందిన అనాథ కోటీశ్వరుడు అవ్వగలడా?అలాంటి కథాంశంతో తెరకెక్కిన చిత్రం స్లమ్‌డాగ్ కోటీశ్వరన్. అది ముంబయి నగరం. అక్కడ అంధేరి ప్రాంతంలో నలుగురు అనాథ యువకులు నివశిస్తుంటారు. వారి లక్ష్యం ఒక్కటే. ఎలాగైనా కోటీశ్వరులు కావాలన్నదే అది. ఇక అదే ప్రాంతంలో నివశించే జేకే అనే వ్యక్తి తన కొడుకుకు అమెరికాకు చెందిన ధనవంతుడైన రాజపాండే కూతురుతో పెళ్లి చేయాలని ఆశిస్తాడు. అయితే రాజపాండేకు జేకే కొడుకు నచ్చడు.

దీంతో పెళ్లికి అంగీకరించడు. ఆయన ఆస్తిపై కన్నేసిన జేకే రాజపాండేను హత్య చేసి ఆయన కూతురును కిడ్నాప్ చేసి ఆస్తి రాయించుకోవాలని ప్రయత్నిస్తాడు. అయితే చిల్లర దొంగతనాలు చేసే(కథానాయకుడి) నలుగురు అనాథల్లో ఒకడి కి హీరోయన్‌ని కిడ్నాప్ చేసిన చోటు తెలియడంతో ఆమెను అతను విడిపించి తీసుకుపోతాడు. వారి కోసం జేకే అనుచరులు ఒక పక్క, పోలీసులు మరో పక్క వేట మొదలెడతారు.

అలాంటి రసవత్తర సన్నివేశాలతో సాగే ఈ కథలో కోటీశ్వరులవ్వాలన్న నలుగురు లక్ష్యం నెరవేరిందా? వారి బారిన పడిన కథానాయకి పరిస్థితి ఏమిటి? ఇత్యాది ఆసక్తికరమైన అంశాల సమాహారంతో తెరకెక్కిన చిత్రం స్లమ్‌డాగ్ కోటీశ్వరన్ అన్నారు ఈ చిత్ర దర్శకుడు రాజేశ్. అరుళ్‌రాజ్ పోలీస్ అధికారిగా ప్రధాన పాత్రను పోషించి నిర్మించిన ఈ చిత్రంలో గోవిందరావ్, మధుర, జ్యోతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్ర పంపిణీ హక్కుల్ని లియో ఇంటర్నేషనల్ అధినేత జేవీ.రుక్మాంగధన్ పొందారు.ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement