ప్రభాస్‌తో పూజాహెగ్డే రొమాన్స్‌? | Pooja Hegde Romance With Prabhas Saaho | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌తో పూజాహెగ్డే రొమాన్స్‌?

May 18 2017 2:37 AM | Updated on Sep 5 2017 11:22 AM

ప్రభాస్‌తో పూజాహెగ్డే రొమాన్స్‌?

ప్రభాస్‌తో పూజాహెగ్డే రొమాన్స్‌?

ప్రభాస్‌ ఈ పేరు ఇంతకు ముందు టాలీవుడ్‌కే పరిమితం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. అందుకు ఏకైక కారణం బాహుబలి. ముఖ్యంగా బాహుబలి– 2

ప్రభాస్‌ ఈ పేరు ఇంతకు ముందు టాలీవుడ్‌కే పరిమితం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. అందుకు ఏకైక కారణం బాహుబలి. ముఖ్యంగా బాహుబలి– 2 చిత్రం తరువాత ప్రభాస్‌తో చిత్రాలు నిర్మించడానికి బాలీవుడ్‌ నిర్మాతలతో సహా పలువురు పోటీ పడుతున్నారు. ఇకపై ఆయన ఒక్క భాషకు చెందిన చిత్రంలో నటించరేమో. కాగా ప్రస్తుతం ప్రభాస్‌ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ  మొదలగు నాలుగు భాషల్లో నిర్మాణం అవుతున్న భారీ చిత్రంలో నటిస్తున్నారు.

సాహో పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుజిత్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో  రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌ ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. కాగా ఈ చిత్రంలో ఇంకా కథానాయకి ఎంపిక కాలేదు. బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు వినిపించినా, తాజాగా ఆ అవకాశం నటి పూజా హెగ్డేను వరించినట్లు సమాచారం. ఈ ఉత్తరాది బ్యూటీ కోలీవుడ్‌లో ఇంతకు ముందు జీవాకు జంటగా ముగముడి చిత్రంతో దిగుమతి అయ్యింది. అదే విధంగా బాలీవుడ్‌లో హృతిక్‌రోషన్‌కు జంటగా  మొహంజధారో చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాలు అమ్మడికి నిరాశనే మిగిల్చాయి.

 అయితే తెలుగులో నటిగా మంచి పేరునే సంపాదించుకున్న పూజాహెగ్డే ప్రస్తుతం అక్కడ అల్లుఅర్జున్‌తో డీజే చిత్రంలో రొమాన్స్‌ చేస్తోంది. తాజాగా ప్రభాస్‌తో డ్యూయెట్లు పాడటానికి సిద్ధం అవుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. సాహో నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి ఈ భాషలన్నింటిలోనూ పరిచయం ఉన్న నటి అయితే బాగుంటుందన్న చిత్ర వర్గాల భావన నటి పూజాహెగ్డేకు కలిసొచ్చి ఉండవచ్చుననే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అయితే చిత్ర యూనిట్‌ ఈ విషయాన్ని వెల్లడించలేదన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement