త్రీ డీల్‌! | Pooja Hegde joins the ensemble cast of Housefull 4 | Sakshi
Sakshi News home page

త్రీ డీల్‌!

Jul 9 2019 12:41 AM | Updated on Aug 22 2019 9:35 AM

Pooja Hegde joins the ensemble cast of Housefull 4 - Sakshi

సౌత్‌లో ప్రస్తుతం సూపర్‌ పాపులర్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌లో పూజాహెగ్డే ఒకరు. వరుసగా టాప్‌ స్టార్స్‌ అందరితో జోడీ కడుతున్నారు. బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమా పూర్తి చేశారు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తేంటంటే బాలీవుడ్‌ ‘బడా ప్రొడక్షన్‌ హౌస్‌ నడియాడ్‌వాలా గ్రాండ్‌ సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌’తో మూడు సినిమాల డీల్‌ కుదుర్చుకున్నారట. జుడ్వా, హౌస్‌ఫుల్, 2 స్టేట్స్, కిక్, భాఘీ చిత్రాలను నిర్మించిన సాజిద్‌ నడియాడ్‌వాలా ఈ మూడు చిత్రాలను భారీ లెవెల్లో నిర్మించనున్నారట.

హౌస్‌ఫుల్‌ తర్వాత ఓ యాక్షన్‌ సినిమాను ఈ బ్యానర్‌లో పూజా హెగ్డే చేయబోతున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం రెండు నెలల భారీ డేట్స్‌ కూడా ఇచ్చారట. ఇందులో ఎన్నో స్టంట్స్‌ ఉండబోతున్నాయని, వాటిని పూజా స్వయంగా చేయబోతున్నారని తెలిసింది. యాంజెలీనా జోలీ నటించిన హాలీవుడ్‌ ఫ్యాంటసీ థ్రిల్లర్‌ ‘టూంబ్‌ రైడర్‌’ తరహాలో ఈ చిత్రకథ సాగనుందట. త్రీ మూవీస్‌ డీల్‌లో భాగంగా చేసిన సినిమాలు సక్సెస్‌ అయితే పూజ బాలీవుడ్‌లోనూ టాప్‌ లిస్ట్‌లో నిలబడడం ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement